అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా విశాఖలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం యోగాలో పాల్గొనే వారి కోసం ఆర్కేబీచ్ నుంచి భీమిలి వరకు అనే కంపార్ట్‌మెంట్స్ ఏర్పాటు చేసింది. ఇక ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా సంఖ్యలో జనం తరలివచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రజలందరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి యోగాను అందించిన ఆదియోగి, పతంజలికి నమస్కారాలు తెలిపారు. యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధాని మోదీ అని పవన్ కల్యాణ్ తెలిపారు. యోగా భారతీయులకు దక్కిన గౌరవమని అన్నారు. యోగాకు 175 దేశాల మద్దతు కూడగట్టిన శక్తి ప్రధాని మోదీదేనని పవన్ కల్యాణ్ కొనియాడారు.
Amaravati News Navyandhra First Digital News Portal