తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది. ఈ అంశంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనన్న షర్మిల.. కేసీఆర్, జగన్ కలిసే ఆ ఇన్ఫర్మేషన్‌ను షేర్ చేసుకున్నారని ఆరోపించారు. తన ఫోన్‌ను, తన భర్త ఫోన్‌ను ట్యాప్ చేశారని చెప్పారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. షర్మిల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తొలిసారి స్పందించారు వైసీపీ అధినేత జగన్. వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేశారో.. లేదో.. తనకు తెలియదన్నారు. గతంలో తెలంగాణ రాజకీయాల్లో షర్మిల యాక్టివ్‌గా ఉన్నారు. అందుకే చేసి ఉంటారేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవహారంతో తనకు సంబంధం లేదని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.
Amaravati News Navyandhra First Digital News Portal