ఆంధ్రప్రదేశ్‌లో నెలనెలా అందుతున్న సామాజిక భద్రతా పింఛన్లు లక్షల సంఖ్యలో ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికిపైగా పింఛన్లు అందుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నెలకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం అయినా పేదలకు మాత్రం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతోంది.
ఇప్పటివరకు భర్త చనిపోయిన తర్వాత పెన్షన్ రాక ఎదురు చూపులు చూసిన వితంతువుల కష్టాలు తీరాయి. వారి పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోయిన భార్యకు.. ఇకపై ఈ నెల నుంచి అదే పెన్షన్ కొనసాగుతుంది. దీనిపైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీ పేరుతో కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా లక్షా తొమ్మిది వేల మంది వితంతు మహిళలకు ఆగస్టు నెల నుంచే పెన్షన్ మంజూరు కానుంది. సామాజిక భద్రత లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఉన్న మానవీయ నేపథ్యం తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు.
లక్షా 9 వేల కొత్త వితంతులకు మద్దతుగా..
చనిపోయిన భర్త పేరుతో వచ్చిన పెన్షన్ అదే ఇంట్లోకి మళ్లీ చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు నెల నుంచే కొత్తగా లక్షా 9 వేల మంది వితంతు మహిళలు.. ప్రభుత్వం నుంచి నెలనెలా పింఛను పొందనున్నారు. ఇప్పటిదాకా ఈ పెన్షన్ మరణంతో ముగిసిపోయేది. ఇకపై అర్హత ఉన్న జీవిత భాగస్వామికి నేరుగా కొనసాగుతుంది. అర్హులుగా గుర్తింపు అనంతరం ప్రభుత్వం వెంటనే పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది.
‘స్పౌజ్’ పెన్షన్ ప్రారంభోత్సవం
శుక్రవారం(ఆగస్టు 1) రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా జమ్మలమడుగులో పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో స్పౌజ్ కేటగిరీ కింద అర్హత పొందిన మహిళలకు సైతం మొదటి విడత పెన్షన్లు అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, రూ.2,750 కోట్లను ఈ పంపిణీకి కేటాయించారు.
ఏపీలో ఏ స్థాయిలో పెన్షన్లు అందుతున్నాయంటే..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలనెలా అందుతున్న సామాజిక భద్రతా పింఛన్లు లక్షల సంఖ్యలో ఉంటున్నాయి.
ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన పెన్షన్ వర్గాలు ఇవే:
- వృద్ధాప్య పెన్షన్
- వితంతు పెన్షన్
- వికలాంగుల పెన్షన్
- చేనేత కార్మికులకు పెన్షన్
- రజకులు, నాయిబ్రాహ్మణులు తదితర కేటగిరీలు
ఇలా కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికిపైగా పింఛన్లు అందుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నెలకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం అయినా పేదలకు మాత్రం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతోంది.