ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. బనకచర్ల ప్రాజెక్టు పూర్తి కోసం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి వనరుల వినియోగాన్ని సమర్థంగా మలచేందుకు మరో కీలక అడుగు వేసింది. బనకచర్ల ప్రాజెక్టును స్థాపించేందుకు పునాది వేస్తూ ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా “జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్” అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అమరావతిని కేంద్రంగా చేసుకుని పనిచేయనున్న ఈ కంపెనీని 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద నీటిని పట్టుకుని, రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. తాజా ప్రభుత్వ నిర్ణయం ద్వారా పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు పరిపాలనా శక్తిని అందిస్తూ, రాష్ట్రం జలస్వావలంబన దిశగా ముందడుగు వేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖచే “జలహారతి కార్పొరేషన్” అనే వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) సంస్థని స్థాపించింది. ఈ సంస్థను పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌గా విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయవచ్చని స్పష్టంగా అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సంస్థకు ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, జలవనరుల మంత్రి వైస్ ఛైర్మన్‌గా, ముఖ్య కార్యదర్శి CEOగా బాధ్యతలు చేపట్టనున్నారు .

అమరావతిని జలవనరుల కేంద్రంగా తీర్చిదిద్దడం..

ఈ కొత్త SPV “జలహారతి కార్పొరేషన్” ద్వారా అమరావతి, గవర్నర్ పేట ప్రాంతంలో ఉన్న జలవనరుల శాఖ కార్యాలయం ఆధారంగా నడపబడుతుంది. ఇది పాలవరం ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వర్తించగల సామర్థ్యాన్ని అందిస్తోంది. అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ జలహారతి కార్పొరేషన్ ఎస్‌పీవీ స్థాపన.. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని సమర్థంగా వినియోగించేందుకు పనిచేస్తుంది.

About Kadam

Check Also

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *