ఆంధ్రా ప్యారిస్ అంటే అందరికి ఠక్కున గుర్తొచ్చేది తెనాలే…ప్యారిస్ లో లాగా ఇక్కడ కూడా మూడు పంట కాలువలు తెనాలి పట్టణం గుండా వెలుతుంటాయి. ఈ పంట కాలవల్లో పర్యాటక రంగ అభివ్రుద్దిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక ద్రుష్టి సారించారు. అత్యంత్య పొడవైన కాలువల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోట్లు తిప్పాలన్న ఆలోచన ఎప్పడి నుండో ఉంది. అయితే అది కార్యారూపం దాల్చటం లేదు. ఈ క్రమంలోనే మంత్రి నాదెండ్ల పర్యాటక రంగ అభివ్రుద్దిలో భాగంగా బోటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిజాంపట్నం కాలువలో బోట్లు నడిపేందుకు అనుకూలంగా ఉందని పర్యాటక శాఖాధికారులు, ఇరిగేషన్ శాఖాధికారులు నిర్ణయించారు.
వైకుంఠపురం నుండి విఎస్సార్ కాలేజ్ వరకూ బోటింగ్ కు అనుకూలంగా ఉందని తేల్చారు. కాలువకు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కూడా పూర్తయింది. ఈ నేపధ్యంలోనే వైకుంఠపురం వెంకటేశ్వరాలయం నుండి కాలేజ్ వరకూ రెండు రకాల బోట్లు నడిపించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం రోజు పర్యాటక శాఖాధికారులు బోట్లతో ట్రయల్ రన్ సైతం నిర్వహించారు. ఎక్కడ బోట్ల నిలిపి ఉంచాలి, ఏ ఏ ప్రాంతాల్లో ప్రయాణీకులు ఎక్కించుకోవాలని అన్న అంశాలతో పాటు కాలువ లోతు ఎంత, బోటు ప్రయాణంలో ఇతర సమస్యలు ఏమైనా ఉత్పన్నం అవుతున్నాయా అన్న అంశాలను ఈ ట్రయల్ రన్ లో పరిశీలించారు.
ఇరిగేషన్, టూరిజం శాఖాధికారులు త్వరలోనే మంత్రి నాదెండ్లకు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం బోటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తారు. తెనాలిలో పర్యాటక రంగం అభివ్రుద్ది కోసం అనేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల చెప్పారు. కాలువల్లో బోటింగ్ తో పాటు మున్సిఫల్ భవనం వద్ద స్కేవాక్ బిడ్ర్జి నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మిని ట్యాంక్ బండ్ కూడా సిద్దమవుతోంది.
రెండు మూడు నెలల వ్యవధిలో బోట్లు తిప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా సమయంలోనే ఈ కాలువలో తెప్పోత్సవం సైతం నిర్వహిస్తున్నారు. వచ్చే పండుగ తర్వాత ఎప్పుడైనా పర్యాటకుల కోసం నిజాంపట్నం కాలువలో బోటింగ్ అందుబాటులోకి రానుంది. ఇక ఆంధ్రా ప్యారిస్ అందాలు అలా అలా బోట్ లో తిరుగుతూ వీక్సించే రోజు తొందరలోనే ఉందని స్థానికులు ఆనందంతో చెబుతున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal