రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే హాల్ టికెట్లు రావడంతో.. రంగుల పేపర్లపై వాటిని డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు వస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. ఇలా రంగుల పేపర్లతో పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చే హాల్‌టికెట్లను అనుమతించబోమని తాజాగా ఇంటర్ బోర్డు హెచ్చిరించింది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. పరీక్షలకు వారం ముందు విద్యార్ధుల మొబైల్ నంబర్లకు విద్యాశాఖ నేరుగా హాల్ టికెట్లను పంపింది. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే హాల్ టికెట్లు రావడంతో.. వారు రంగుల పేపర్లపై వాటిని డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరవుతున్నారు. ఇలా రంగుల పేపర్లతో తీసుకువచ్చే హాల్‌టికెట్లను అనుమతించబోమని పరీక్షల నియంత్రణ అధికారి (సీఓఈ) సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు.
విద్యార్ధులందరూ తప్పనిసరిగా తెల్ల కాగితంపై హాల్ టికెట్లను ప్రింట్ తీసుకోవాలని, హాల్‌టికెట్లను వెబ్‌సైట్, వాట్సప్‌ల్లో అందుబాటులో ఉంచడంతో కొందరు రంగుల పేపర్లపై ప్రింట్లు తీసుకొని వస్తున్నారని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులందరూ దీనిని పాటించాలని అన్నారు. కాగా మొత్తం 1535 కేంద్రాల్లో 26 జిల్లాల్లో దాదాపు 10,58,892 మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. మార్చి 19 వరకు ఫస్ట్ ఇయర్, మార్చి 20 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ జీడీ ప్రాథమిక కీ విడుదల.. మార్చి 9 వరకు అభ్యంతరాల స్వీకరణ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ జీడీ పరీక్షల ప్రాథమిక కీని తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యంతరాల స్వీకరణకు మార్చి 9వ తేదీ వరకు గడువు ఇచ్చింది. కాగా ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఎస్సెస్సీ కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ జీడీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనుంది.