గుంతకల్లు కుర్రోడి సత్తా.. Btech చదువుతుండగానే రూ.5 కోట్ల ప్యాకేజీతో అమెరికాలో జాబ్!

గుంతకల్లుకు చెందిన ఓ కుర్రాడు ఏకంగా రూ.5 కోట్ల ప్యాకేజీతో అమెరికాలోని ఆప్టివర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొలువు దక్కించుకున్నాడు. బీటెక్‌ ఫైనల్ ఇయర్‌ చదువుతున్న సదరు విద్యార్ధి చదువు పూర్తికాకుండానే ఇంత పెద్ద భారీ ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపిక కావడం విశేషం..

రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఓ కుర్రాడు ఏకంగా రూ.5 కోట్ల ప్యాకేజీతో అమెరికాలోని ఆప్టివర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొలువు దక్కించుకున్నాడు. బీటెక్‌ ఫైనల్ ఇయర్‌ చదువుతున్న సదరు విద్యార్ధి చదువు పూర్తికాకుండానే ఇంత పెద్ద భారీ ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపిక కావడం విశేషం. గుంతకల్లుకు చెందిన రమేశ్, వాసవి దంపతుల కుమారుడు సాయి సాకేత్‌. పదేళ్ల కిందట వీరు అమెరికాకు వెళ్లారు. అక్కడే నివాసం ఉంటున్న వీరు తమ కుమారుడు సాయి సాకేత్‌ను అమెరికాలోనే చదివిస్తున్నారు. అక్కడ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతుండగానే సాయిసాకేత్‌కు రూ.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో అమెరికాలోని ఆప్టివర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొలువకు అర్హత సాధించాడు.

ఆప్టివర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇటీవల నిర్వహించిన ఎంపిక పరీక్షకు సాయి సాకేత్‌ కూడా హాజరయ్యాడు. ఈ పరీక్షలో సాఫ్ట్‌వేర్, బిజినెస్, గణితం విభాగాల్లో అత్యంత ప్రతిభను చూపినందుకుగానూ ఆ సంస్థ సాయి సాకేత్‌ను ఉద్యోగానికి ఎంపిక చేసింది. ఇందులో భాగంగా 2 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేయవల్సి ఉంటుంది. దీనికి రూ.కోటి వేతనం అందుకోనున్నాడు. ఇక కోర్సు పూర్తి కాగానే ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున ప్యాకేజీ ఇవ్వడానికి సదరు కంపెనీ అంగీకరించినట్లు సాకేత్ కుటుంబ సభ్యులు తెలిపారు.

సెప్టెంబర్‌ 11 నుంచి ఏపీ ఫార్మసీ మొదటి విడత కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఫార్మసీ (బైపీసీ స్ట్రీమ్‌) కౌన్పెలింగ్‌కు సంబంధించిన మొదటి, రెండో విడతల షెడ్యూల్‌లను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. సెప్టెంబరు 11 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 12 నుంచి 17 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. సెప్టెంబర్‌ 13 నుంచి 18 వరకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదు, 19న ఐచ్ఛికాల మార్పు, 21న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్‌ 21 నుంచి 23లోపు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. రెండో విడత బైపీసీ స్ట్రీమ్‌ కౌన్సెలింగ్‌లో సెప్టెంబరు 24, 25 తేదీల్లో ఉంటుంది. 28న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబరు 8లోపు ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *