ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ఎరువురులు సరఫరా చేసి ఉండే రైతులు రోడ్డెక్కేవారా? అని మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం కనీస బాధ్యతను కూడా నిర్వర్తించడంలేదని మండిపడ్డారు. కుప్పం లోనూ రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో ఎప్పుడూ రైతులు రోడ్డెక్కలేదని.. అప్పుడు లేని రైతు కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయన్నారు.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? అని జగన్ ప్రశ్నించారు
లా అండ్ ఆర్డర్ కాపాడటం లేదు. ప్రజల అభివృద్ధి లేదు సంక్షేమం లేదు.. ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన విద్యా వైద్యం వ్యవసాయం ప్రైవేటు వ్యక్తుల దోపిడీకి గురి అవుతుందని జగన్ పేర్కొన్నారు. రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ స్కామ్స్ చేస్తున్నారన్నారు. దానిపై వైఎస్ఆర్‌సీపీ ఆందోళన చేస్తే పోలీస్ లు బెదిరిస్తూ నోటీస్ ఇచ్చారన్నారు.
ఎరువులను టీడీపీ నాయకులే పక్కదారి పట్టించి అమ్ముకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఎరువులను బ్లాక్‌చేసి, కొరతను సృష్టించి, బ్లాక్‌లో అమ్ముతున్నారని అన్నారు. రాష్ట్రంలో రూ.250 కోట్ల యూరియా స్కాం జరుగుతోందని..బ్లాక్ మార్కెటింగ్‌పై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని జగన్ పేర్కొన్నారు.