ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఉద్యోగ నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు

రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల కలిగిన..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్, మెడికల్ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 15, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 48 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్- (టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌ తప్పనిసరిగా చదివి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మెడికల్ కౌన్సెల్‌ (ఏపీఎంసీ)లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అలాగే కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం, టైపింగ్ నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి. అన్ని రకాల వర్గాలకు వయోపరిమితి 60 సంవత్సరాలకు మించకూడదు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌ఐలన్‌ విధానంలో సెప్టెంబర్‌ 15, 2025వ తేదీ రాత్రి 11.59 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మాజీ సైనికులు, దివ్యాంగులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్‌ ప్రాతిపదికన, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలు, సర్వీస్‌ వెయిటేజ్‌ ఆధారంగా మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.55,350 జీతంగా చెల్లిస్తారు.

About Kadam

Check Also

ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. యూపీఎస్సీలో లెక్చర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉద్యోగాలు!

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, లెక్చరర్‌ పోస్టుల భర్తీకి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *