అటవీ శాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించవల్సిన రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల..
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించవల్సిన రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు సంబంధిత అడ్మిట్ కార్డులను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు తమ ఓటీపీఆర్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా రాత పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సెప్టెంబరు 7, 2025న నిర్వహించనున్నట్లు ఇప్పటికే కమిషన్ తెలిపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అటవీ శాఖలో మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే ఈ పరీక్ష పెన్ను, పేపర్ పద్ధతిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి నడక, మెడికల్ పరీక్షలు ఉంటాయి. అన్నిట్లోనూ అర్హత పొందినవారికి మాత్రమే ఉద్యోగం వరిస్తుంది.
ప్రిలిమినరీ పరీక్ష ఎలా ఉంటుందంటే?
ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 150 మార్కులకు 150 నిమిషాల్లో నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో మాత్రమే ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో పార్ట్ ఎ, పార్ట్ బి అనే రెండు భాగాలుగా ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క విభాగం నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. 45 రోజుల సమయమే ఉంది కాబట్టి కొత్తగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పూర్తిగా సమయం కేటాయించి చదివితే విజయం వరిస్తుంది.