ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టులు 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులు 435 వరకు ఉన్నాయి…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టులు 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులు 435 వరకు ఉన్నాయి. మెరిటోరియస్, స్పోర్ట్స్ పర్సన్స్ కోసం ప్రత్యేక కోటా కింద పోస్టులు భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2025 జులై 16 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ఏబీఓ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే శారీరక ప్రమాణాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ పోస్టులకు స్ట్రీ, పురుష అభ్యర్థులు ఎవరైనా పోటీ పడవచ్చు. అయితే పురుష అభ్యర్ధులు కనీసం 163 సెం.మీ ఎత్తు, మహిళలు కనీసం 150 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు ఇస్తారు. అభ్యర్ధుల వయోపరిమితి 2025 జులై 1 నాటికి తప్పనిసరిగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 5, 2025వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు అయిపోతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ముందుగా అభ్యర్ధులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఓబీపీఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి. దరఖాస్తు చేసేటప్పుడు అన్ని వివరాలు ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామినేషన్ ఫీజు రూ.80 కలిపి మొత్తం 330 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఎక్స్‌సర్వీస్‌మెన్, నిరుద్యోగ యువత తదితరులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.250 మాత్రమే చెల్లించాలి. వీరికి ఎగ్జామినేషన్ ఫీజు రూ.80 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ ఓఎంఆర్ బేస్డ్), మెయిన్స్ ఎగ్జామినేషన్, నడక / మెడికల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియేన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నెల