డీపో మేనేజర్ సత్యనారాయణ చెప్పిన వివరాల మేరకు.. నేటి నుండి 12వ తేదీ వరకు హైదరాబాద్ నుండి అమలాపురం వచ్చేందుకు 97 సర్వీసులు అదనంగా ఏర్పాటు చేసినట్టు డిపో మేనేజర్ తెలిపారు. సాధారణ రోజుల్లో 12 బస్సు సర్వీసులు నడపగా సంక్రాంతి సందర్భంగా 85 ప్రత్యెక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. మరలా తీరుగు ప్రయాణం కోసం 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమలాపురం నుండి హైదరాబాద్ కు 220 బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ హైదరాబాద్ నుండి అమలాపురం వచ్చేందుకు స్పెషల్ బస్సులు సిద్ధం చేసింది అమలాపురం ఆర్టీసీ.. సంక్రాంతి పండుగ అనగానే కోనసీమకు క్యూ కడతారు ఇతర రాష్ట్రాలలో ఉండే అందరూ సొంత ఊర్లకు పయనమవుతారు ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి కోనసీమకు పచ్చే ప్రయాణి కుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యెక బస్సులను నియమించారు.అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి 217 ప్రత్యెక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశాం అన్నారు డీపో మేనేజర్ సత్యనారాయణ.
నేటి నుండి 12వ తేదీ వరకు హైదరాబాద్ నుండి అమలాపురం వచ్చేందుకు 97 సర్వీసులు అదనంగా ఏర్పాటు చేసినట్టు డిపో మేనేజర్ తెలిపారు. సాధారణ రోజుల్లో 12 బస్సు సర్వీసులు నడపగా సంక్రాంతి సందర్భంగా 85 ప్రత్యెక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశాం అని మరలా తీరుగు ప్రయాణం కోసం 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమలాపురం నుండి హైదరాబాద్ కు 220 బస్సు సర్వీసులు ఏర్పాటు చేశాం అన్నారు. అంతేకాకుండా ఎటువంటి అదనపు టికెట్ ధరలు పెంచకుండా సాధారణ రోజుల్లో అమలు చేసే రెట్లలో నే టిక్కెట్ ధరలు వుంటాయని చెప్పారు.
హైదరాబాదులో అన్ని రూట్లో ఆర్టీసీ బస్సులు అందుబాటులు ఉంటాయని అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరం అయితే మరిన్ని బస్సు సర్వీసులు పెంచేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది అన్నారు అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ. అమలాపురం టు హైదారాబాద్ తోపాటు విశాఖ, విజయవాడ అనేక రూట్లలో ప్రత్యెక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశాం అని ప్రయాణికులు ఆర్టీసీ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ..
Amaravati News Navyandhra First Digital News Portal