సీఎం వచ్చారు.. ఆ ఊరికి బస్సు వచ్చింది.. ఏం జరిగిందో మీరే చూడండి

ఆ గ్రామానికి ఎన్నో ఏళ్లుగా బస్సు సర్వీసు లేదు. విద్యార్ధులు, జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ గ్రామానికి సీఎం చంద్రబాబు ఒక్కసారి వచ్చారు. కట్ చేస్తే.. ఆ ఊరికి బస్సు వచ్చింది. అది ఎక్కడంటే

ఎన్నో ఏళ్లుగా ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసే లేదు. ఎంత అత్యవసరమైనా.. సొంత వాహనంలోనో.? లేదా ఆటోలోనో.? ఆ ఊరి ప్రజలు వెళ్లాల్సిందే. కానీ సీఎం చంద్రబాబు ఒక్కసారి ఆ గ్రామానికి వెళ్లారు. అంతే ఆ ఊరికి బస్సు వచ్చేసింది. సీఎం చంద్రబాబు గత నెల నవంబర్ 30వ తేదీన అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నేమకల్లు పర్యటనకు వచ్చారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా నెమకల్లు వచ్చిన సీఎం చంద్రబాబును గ్రామంలోని విద్యార్థులు తమ ఊరికి ఆర్టీసీ బస్సు సర్వీస్ కావాలని అడిగారు.

విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలన్నా.. గ్రామస్తులు ఏదైనా పని కోసం కర్ణాటక సరిహద్దు అయిన బళ్లారికి వెళ్లాలన్నా.. బస్సు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల పల్లెటూరు కావడంతో నేమకల్లు గ్రామానికి ఇప్పటివరకు అసలు ఆర్టీసీ బస్సు ఊరికి వచ్చిందే లేదు. దీంతో సీఎం చంద్రబాబు విద్యార్థుల కోరిక అడిగిన వెంటనే నెరవేర్చారు. అధికారులతో మాట్లాడి వెంటనే గ్రామానికి ఆర్టీసీ బస్ సర్వీస్ ఏర్పాటు చేశారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నేమకల్లు ఆంజనేయస్వామి గుడి దగ్గర విద్యార్థులకు మాట ఇచ్చిన సీఎం చంద్రబాబు. సరిగ్గా అక్కడ నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసును అధికారులు ప్రారంభించారు. కనేకల్ నుంచి బళ్లారికి వెళ్లే బస్సు సర్వీసును వయా నేమకల్లు మీదుగా ప్రారంభించారు. కోరిక నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

About Kadam

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *