Kadam

సుప్రీంకోర్టులో నిమిష ప్రియ కేసు విచారణ… తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా

యెమెన్‌ దేశంలో కేరళ నర్స్‌ నిమిషా ప్రియకు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ఈ మేరకు కోర్టుకు తెలిపారు పిటిషనర్‌ నిమిష తల్లి తరపు న్యాయవాది. శుక్రవారం సుప్రీంకోర్టులో కేరళ నర్సు నిమిష ప్రియ కేసు విచారణ చేపట్టింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ సందర్భంగా న్యాయవాది ఉరిశిక్ష అమలు వాయిదా పడినట్లు వెల్లడించారు. బ్లడ్ మనీ గురించి చర్చించేందుకు యెమెన్ వెళ్లాల్సి ఉందని, అక్కడ ఒక మత గురువు ఈ వ్యవహారంలో భాగమయ్యారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన …

Read More »

అర్ధరాత్రి చోరీకి వచ్చి.. గుర్రుపెట్టి నిద్రపోయిన దొంగ దొర! ఆ తర్వాత ఏం జరిగిందంటే

 ఓ దొంగ గారు అర్ధరాత్రి ఊరంతా సద్దుమనిగాక పిల్లిలా దొంగతనానికి వచ్చాడు. చప్పుడు చేయకుండా ఓ ఇంట్లో చొరబడ్డాడు. ఇంట్లో దూరిన దొంగ చకచకా వచ్చిన పని కానిచ్చి జారుకోవాలనే విషయం మర్చిపోయాడు. అంతే.. అసలే అర్ధరాత్రి, ఆపై నిద్ర ముంచుకు రావడంతో చక్కగా ఫ్యాన్‌ కింద పడుకుని గురకలు పెట్టి మరీ నిద్రపోయాడు. ఇంతలో బయటకు వెళ్లిన ఇంటి యజమాని ఇంటి తలుపులు తీసి ఉండటం చూసి అవాక్కయ్యాడు. ఇంట్లోకి తొంగి చూడటంతో లోపల గుర్తుతెలియని అగంతకుడు హాయిగా నిద్రపోవడం చూసి వెంటనే …

Read More »

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో మరణించింది. తల్లి మృతిని తట్టుకోలేక కుమార్తె తల్లి శవం ముందు కన్నీరు కారుస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఆరు గంటల వ్యవధిలో ఇద్దరూ మరణించడం కుటుంబాన్ని, గ్రామస్తులను కలచివేసింది. తల్లీ కూతుళ్ల మధ్య బంధం ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. తల్లి మృతికి తట్టుకోలేక కుమార్తె కూడా తల్లి మృతదేహం ముందు కన్నీరు కారుస్తూ ప్రాణాలు వదిలింది. విజయనగరం జిల్లా భోగాపురంలో …

Read More »

అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..

అందమైన సాగరతీర నగరం విశాఖ.. కొందరు అక్రమార్కుల బారినపడి కొన్ని విషయాల్లో మసకబారిపోతోంది. అడపా దడపా డ్రగ్స్ రాకెట్లు, సీజన్‌కోసారి కిడ్నీ అమ్మకం దందాలు.. పోలీసుల్ని సైతం హైరానా పట్టిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఒడిషా కేంద్రంగా ఒక కిడ్నీ రాకెట్ విశాఖ మీద కన్నేసినట్టు ఖాకీలకు వాసనొచ్చింది. ప్రాణం పోయాల్సిన డాక్టర్లే కిడ్నీ బ్రోకర్లుగా మారడం ఇక్కడ బాధాకరమైన కొసమెరుపు. వైజాగ్‌లోని ఒక హోటల్‌ను అడ్డాగా మార్చుకుని కిడ్నీ వ్యాపారానికి పాల్పడే ముఠా ఒకటి విశాఖ పోలీసుల రాడార్‌లోకొచ్చింది. జనవరి 27న తొలిసారి ఫోన్ చేసి.. …

Read More »

తెలంగాణ రాజకీయాల్లో చిట్ చాట్ చిటపటలు… కౌంటర్‌.. రీకౌంటర్లతో ఢీ అంటే ఢీ

తెలంగాణ రాజకీయాలకు చిట్‌చాట్ మంటలు అంటుకున్నాయి. గంజాయ్ బ్యాచ్ అంటూ అధికారపక్షం విపక్షాన్ని టార్గెట్ చేస్తుంటే… డైవర్ట్ రాజకీయాలు అస్సలొద్దు. దమ్ముంటే నిరూపించూ అంటూ విపక్షం అధికార పార్టీకి సవాల్ విసురుతోంది. అసలే తెలంగాణ రాజకీయాలు బనకచర్ల ఇష్యూతో భగభగ మండుతున్నాయి. ఇప్పుడు అగ్నికి ఆజ్యం అన్నట్లుగా చిట్‌చాట్ చిటపటలు కూడా అంటుకున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో మాజీ మంత్రి కేటీఆర్ ను గంజాయి బ్యాచ్‌తో పోల్చడంతో వివాదం రాజుకుంది. కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని, …

Read More »

హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

తెలంగాణ రవాణా రంగ అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి తుది లొకేషన్ సర్వే పూర్తి అయింది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే, రాష్ట్ర రాజధానిని చుట్టూ కొత్త రైల్వే మార్గం ఏర్పడనుండగా, ఇది దేశంలోనే వినూత్న ప్రయత్నంగా నిలవనుంది. ఔటర్ రింగ్ రైలు మార్గం ప్రధానంగా సికింద్రాబాద్‌ను అనుసంధానించే ఆరు రైలు కారిడార్లతో కలిపి రూపొందించనున్నారు. వాటిలో సికింద్రాబాద్–కాజీపేట, వాడి, డోన్, ముర్కడ్, గుంటూరు, కొత్తపల్లి మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలతో అనుసంధానం వల్ల రైల్వే రాకపోకలపై …

Read More »

ఏంటి చెల్లమ్మా ఇలా చేశావ్.. ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడింది.. కట్ చేస్తే, ఊహించని పని..

ఆన్లైన్ బెట్టింగ్, క్యాసినో కు అలవాటు పడింది.. అప్పులు చేసి.. మరి ఆట ఆడింది.. కానీ.. ఫుల్లుగా డబ్బులు పోయాయి.. ఏం చేయాలో అర్థం కాలేదు.. అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేసింది.. అలా చూస్తుండగానే.. 5 లక్షల వరకు అప్పుల పాలైంది.. ఇక చేసిన అప్పులను తీర్చేందుకు తన సొంత అన్న ఇంట్లోనే చోరి చేయించింది.. చివరకు అసలు విషయం తెలియడంతో కటకటాల పాలైంది.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. …

Read More »

కాచిగూడ టూ జోధ్‌పూర్‌ డైరెక్ట్‌ రైలు..! కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో రేపటి నుంచే షురూ..

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభ్యర్థన మేరకు, హైదరాబాద్, జోధ్‌పూర్ మధ్య నేరుగా రైలు సర్వీసును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమోదించారు. జూలై 19న కాచిగూడ నుండి ప్రారంభమయ్యే ఈ రైలు, హైదరాబాద్‌లోని రాజస్థానీ ప్రజలకు, విద్యార్థులు, వ్యాపార ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. హైదరాబాద్, జోధ్‌పూర్ మధ్య రోజు వారీ డైరెక్ట్‌ రైలును ప్రవేశపెట్టాలని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి జి కిష్గన్ రెడ్డి చేసిన అభ్యర్థనకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఇది …

Read More »

రైల్వే గేటు సమీపంలో అనుమానాస్పద రీతిలో తచ్చాడిన వ్యక్తి.. కట్ చేస్తే

తిరుపతి జిల్లా.. రేణిగుంట సమీపంలోని చింతలచేను రేల్వే గేట్.. వచ్చి పోయే ట్రైన్లు, అటుగా వెళ్లే వాహనాలతో ఆ ప్రాంతం హాడావుడిగా ఉంది.. ఈ క్రమంలో రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి అటు ఇటు తిరుగుతున్నాడు.. ఈ సమయంలోనే అతను ఏదో టెన్షన్ పడుతూ.. తేడాగా కనిపిస్తున్నాడు.. దీంతో అక్కడున్న వారికి అనుమానం కలిగింది.. అతను ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కాలేదు.. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో.. గంజాయ్ గప్పుమంటూ అసలు కథ వెలుగులోకి వచ్చింది.. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న …

Read More »

ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్‌ ఆఫీసర్‌ పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవల ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే తాజాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ఎగ్జామినేషన్‌ షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. రాత …

Read More »