Kadam

Vande Bharat: ఏపీకి మరో వందే భారత్‌.. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ!

సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ వందే భారత్‌లో అధునాతన సదుపాయాలు ఉన్నాయి. టెక్నాలజీతో కూడిన రైలు. ఈ రైలుకు ఇతర రైళ్లకంటే టికెట్‌ ధర ఎక్కువ ఉన్నప్పటికీ డిమాండ్‌ మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను నడిపేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది.. భారత రైల్వే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణించే రైల్వేలో హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇక ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ …

Read More »

Winter: చలికాలంలో చర్మం ఎందుకు పగులుతుందో తెలుసా.?

చలికాలం రాగానే ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో చర్మం పగలడం ఒకటి. అయితే చలి కాలం రాగానే చర్మం ఎందుకు పగులుతుందన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా.? దీనికి అసలు కారణం ఏంటి.? ఎలాంటి చిట్కాలు పాటించాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…చలి పంజావిసురుతోంది. రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటలకే చీకటిపడుతోంది. ఇదిలా ఉంటే చలికాలం రాగానే మొదటగా వచ్చే సమస్య చర్మం పొడిబారడం. చలికాలంలో చర్మం పొడిబారి మెరుపును కోల్పోతుంది. పెదవులు మొదలు ముఖం, కాళ్లు చేతులు పగులుతాయి. దీంతో మాయిశ్చరైజర్లు …

Read More »

అసలుది వదిలి.. మరో గ్రూపు రక్తం ఎక్కించిన వైద్యులు.. ప్రాణం తీసిన సర్కార్ ఆసుపత్రి వైద్య సిబ్బంది..!

కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో దారుణం వెలుగు చూసింది. డయాలసిస్ కోసం వచ్చిన రోగికి ఒక రక్తానికి బదులు మరో గ్రూపు రక్తం ఎక్కించడం వల్ల ఓ మహిళ ప్రాణాల కోల్పోయింది. కాకినాడ జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందింది. కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అనుభవజ్ఞులైన వైద్యులున్నారు. కావాల్సినన్ని మౌలిక సదుపాయాలున్నాయి. కానీ ఇక్కడ ప్రాణం ఖరీదు కేవలం రూ.3 లక్షలు మాత్రమే. కొంతమంది వైద్య విద్యార్థుల అవగాహనా రాహిత్యంతో నిర్లక్ష్యంగా ఒక గ్రూపునకు బదులు మరో గ్రూపు రక్తం …

Read More »

నిర్మానుష్య ప్రదేశంలోకి డ్రోన్ పంపిన పోలీసులు.. చెట్ల పోదల మాటున చిక్కారుగా

బ్లేడ్‌ బ్యాచ్‌..గంజాయి గ్యాంగ్‌.. తాగుబోతులు ముఠా.. ఇలా ఎవరైనా సరే.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఓవరాక్షన్ చేస్తే కుదరదు. పోలీసులు.. డ్రోన్లతో మీ వైపు దూసుకువస్తున్నారు. అక్కడ తప్పించుకున్నా.. విజువల్స్ సాయంతో మిమ్మల్ని పసిగట్టి ఇంటికి వచ్చి మరీ తోలు తీస్తారు. డ్రోన్లతో తాగుబోతులకు, పేకాట రాయుళ్లకు దడ పుట్టిస్తున్నారు పోలీసులు. బహిరంగంగా లిక్కర్‌ లాగిస్తున్న వారిని హడలెత్తిస్తున్నారు. పేకాట దందాలకు చెక్ పెడుతున్నారు. అనంతపురం శివారు ప్రాంతాల్లో ఆకతాయుల ఆట కట్టించేందుకు డ్రోన్లు వినియోగిస్తున్నారు పోలీసులు.పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో తాగేస్తున్న మందుబాబులకు దడ …

Read More »

 తిరుమలలో అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం.. త్వరలో అన్నిసేవలకు ఆధారే ఆధారం..

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పాపాలను పోగొట్టుకునిసద్గతి పొందాలని భక్తులు భావిస్తారు. అందుకనే తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం తిరుమలకు విచ్చేస్తారు. అటువంటి పవిత్ర పుణ్య క్షేత్రం కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అవినీతి పనులు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు టీటీడీ సిద్ధమైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో ముదస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న …

Read More »

 వామ్మో.. పదేళ్ల తర్వాత ఢిల్లీలో డేంజరస్ వైరస్ కేసు నిర్ధారణ.. లక్షణాలు ఏమంటే..?

ఏ సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో ఏమో.. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా రకరకాల వైరస్ లు వెలుగులోకి వస్తూ మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. తాజాగా జపనీస్ మెదడువాపు జ్వరం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ప్రకారం, ఢిల్లీలోని వెస్ట్ జోన్‌లోని బందీపూర్ ప్రాంతంలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఇది దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఏ సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో …

Read More »

నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్

మనం పుట్టక ముందు అంటే.. కోట్ల సంవత్సరాల క్రితం.. డైనోసర్ల కాలం మనుగడలో ఉండేది. ఆకారంలో భారీగా.. పెద్దవిగా ఉండే ఈ డైనోసర్ లాంటి జీవులు కొన్ని ఇప్పటికీ ప్రపంచంలోని నలుమూలల ఎక్కడొక చోట ఇంకా జీవనం సాగిస్తూనే ఉన్నాయి. ఇక వాటిలా ఉండే ఓ జీవి టైటానోబోవా పాము. దీనిని ‘మోన్‌స్టర్ స్నేక్’ అని కూడా పిలుస్తారు. భూమిపై ఉన్న అతి పెద్ద పాముల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. ప్రస్తుతం ఆఫ్రికా అడవుల్లో కనిపించే అనకొండల కంటే ఇవి చాలా పెద్దవి. మొసళ్లను …

Read More »

బాబోయ్‌ దండుపాళ్యెం క్రైం సీన్‌! అద్దెల్లు కోసం వచ్చి.. కళ్లల్లో కారం కొట్టి.. 

ఇల్లు అద్దెకు కావాలని ఓ జంట ఓ భవంతి ముందు నిలబడ్డారు. ఇంతలో ఇంటి యజమానులు రావడంతో ఎంతో కలుపుగోలుగా మాట్లాడారు. దీంతో ఇంటిని అద్దెకు ఇవ్వడానికి యజమానులు అంగీకరించారు. అదే వాళ్ల ప్రాణానికి హాని తలపెట్టింది. వచ్చిన కొత్త మనుషులు అదే రోజు రాత్రి మళ్లీ వచ్చారు. యజమాని ఇంట్లో భోజనం చేసి, దంపతును ఘోరంగా హత్య చేశారు. ఈ జంట హత్యలు ఖమ్మం జిల్లాలో బుధవారం (నవంబర్‌ 27) ఉదయం వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నివసిస్తున్న ఎర్రా …

Read More »

Cyclone Fengal: వామ్మో.. తుఫాన్ గండం.. ఏపీ ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు

తమిళనాడు, ఏపీపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్‌గా మారనుంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నెమ్మదిగా కదులుతోంది.. గడిచిన 6 గంటల్లో గంటకు 2 కిమీ వేగంతో కదులుతుంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 110 కి.మీ, నాగపట్నానానికి 310 కి.మీ, పుదుచ్చేరికి 410 కి.మీ, చెన్నైకి 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది.. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఉదయంలోపు తుపానుగా …

Read More »

సమస్య ఈవీఎంలది కాదు.. కాంగ్రెస్‌ పార్టీది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కీలక వ్యాఖ్యలు..

ఏపీ, హర్యానా, మహారాష్ట్ర. ఎన్నికలు ఎక్కడ జరిగినా… ఈవీఎంలపై ఆరోపణలు రావడం మాత్రం మామూలైపోయింది. దీనిపై ఈసీ క్లారిటీ ఇచ్చినా.. మళ్లీ మళ్లీ ఆరోపణలు, అనుమానాలు మాత్రం ఆగడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎవరో ఒకరు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారుతుంది.. ఇప్పటికే.. ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చినా.. అందులో ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ నుంచి ఈ రకమైన ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. తాజాగా జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన …

Read More »