తక్షణమే ఆ ఉద్యోగులను తొలగించండి… టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలెలా ఇస్తారు? : బండి సంజయ్‌

తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టిన రోజు సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బండి సంజయ్‌. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో వెయ్యి మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారుని.. వారిని వెంటనే తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో టీటీడీని రిక్వెస్ట్ చేయడం లేదు.. ఘాటుగా హెచ్చరిస్తున్నానని చెప్పారు బండి సంజయ్‌. ఇంకెన్ని రోజులు అన్యమతస్తులను కొనసాగిస్తారు.. వెంటనే ఫుల్ స్టాప్‌ పెట్టాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు టీటీడీని వాడుకోవద్దంటూ బండి రిక్వెస్ట్ చేశారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాలనుండి తొలగించాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

హిందువుల ఆస్తి తిరుమల. విదేశీయులు, అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి. దురద్రుష్టమేమిటంటే టీటీడీలో వెయ్యి మందికిపైగా ఇతర మతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి హిందు మతంపై, దేవుడిపై నమ్మకం లేదు. అట్లాంటోళ్లకు ఉద్యోగాలివ్వమేంటి? వాళ్లను కొనసాగించడమేంటి? ఇట్లాంటి పద్దతి మంచిది కాదు. ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోంది. స్వామివారిపై నమ్మకంలేని వ్యక్తులకు జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారు. హిందువులంతా దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడో వాళ్లను నియమించారని చెప్పి తప్పించుకోవడం సరికాదు. తక్షణమే వాళ్లను తొలగించాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

ఆ దేవాలయాలను అభివృద్ధి చేయాలి:

తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలను గుర్తించి టీటీడీ నిధులు కేటాయించాలని బండి సంజయ్‌ కోరారు. కరీంనగర్ లో భూమిపూజ చేసిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని వెంటనే నిర్మించాలని బండి సంజయ్‌ కోరారు. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివ్రుద్ధి చేయాలన్నారు.

బండికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు:

బండి సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కడ్, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిసహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు బండి సంజయ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు బండి సంజయ్‌ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో జీవించాలి. దేశం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం కలిసికట్టుగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉండాలి. శక్తివంతమైన భారత్ నిర్మాణం కోసం, దేశాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించేలా శక్తి సామర్థ్యాలు కల్పించాలని స్వామి వారిని వేడుకున్నానని బండి సంజయ్‌ చెప్పారు.

About Kadam

Check Also

అంతా దైవ మహత్యమే.. అకస్మాత్తుగా గుడి ముందు ప్రత్యక్షమైన దేవుడి విగ్రహాలు.. చిన్న కథ కాదు..

ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలం గారపాడులో స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.  అందరూ అంత సంతోషం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *