ఈ వారంలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

మీరు వచ్చే వారం బ్యాంకు సంబంధిత పనులు పూర్తి చేయాలనుకుంటే ముందుగా బ్యాంకులు ఏ తేదీలలో మూసి ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. జూన్ 22 – జూన్ 30, 2025 మధ్య వివిధ రాష్ట్రాల్లో పండుగలు, వారాంతాల్లో బ్యాంకింగ్ సేవలు చాలా రోజులు నిలిచిపోనున్నాయి.

ఈ నెలలో మొత్తం 12 బ్యాంకు సెలవులు:

ఈ నెలలో బక్రీద్, వారాంతాలు, వివిధ రాష్ట్రాల పండుగలు కలిపి మొత్తం 12 బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం బ్యాంకులు మూసి ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ (RBI), రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తాయి. మతపరమైన, సాంస్కృతిక, స్థానిక, కార్యాచరణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ జాబితా తయారు రూపొందిస్తుంది ఆర్బీఐ.

జూన్ 22 నుండి 30 వరకు బ్యాంకు సెలవుల జాబితా:

  1. జూన్ 22 (ఆదివారం) — వారాంతపు సెలవు — దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
  2. జూన్ 27 (శుక్రవారం) – రథయాత్ర / కాంగ్ – ఒడిశా, మణిపూర్‌లలో బ్యాంకులు బంద్‌
  3. జూన్ 28 (శనివారం) — నాల్గవ శనివారం — దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
  4. జూన్ 29 (ఆదివారం) — వారాంతపు సెలవు — దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.
  5. జూన్ 30 (సోమవారం) – రెమ్నా ని – మిజోరంలో బ్యాంకులు మూసి ఉంటాయి.

అయితే ఈ సెలవులన్ని అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోండి. ఆయా రాష్ట్రాల్లో పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి సెలవులు ఉంటాయి. అయితే జూన్‌ 28న నాలుగో శనివారం, 29న ఆదివారం దీంతో అన్ని రాష్ట్రాల్లో ఈ రెండు రోజులు మాత్రం బ్యాంకులు మూసి ఉంటాయి. ఒడిశా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అయితే ఏకంగా మూడు రోజుల పాటు వరుసగా బ్యాంకులు మూసి ఉంటాయి.

ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో..

బ్యాంకు సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, UPI, ATMలకు సంబంధించిన పనులు సాధారణంగా కొనసాగుతాయి. అయితే, ఏదైనా సాంకేతిక కారణం వల్ల ఏదైనా సేవకు అంతరాయం కలిగితే, దాని గురించిన సమాచారం బ్యాంకు ద్వారా అందుతుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం బ్యాంకుల వార్షిక సెలవుల జాబితాను RBI జారీ చేస్తుంది. ఈ సెలవు దినాల్లో చెక్కులు లేదా ఇతర లావాదేవీ పత్రాలకు సంబంధించిన పనులు చేయలేము.

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *