బెంగళూరుకు చెందిన ఉబెర్ బైక్ డ్రైవర్ నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నట్లు చెప్పారు. అతడు తన సంపాదన గురించి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని నెల జీతం విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో కర్ణాటక పోర్ట్‌ఫోలియో (@karnatakaportf) అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో ఉబర్ బైక్ డ్రైవర్ హిందీలో మాట్లాడుతున్నాడు. అతని మాటల ప్రకారం.. నేను రోజుకు 13 గంటలు పనిచేసి నెలకు దాదాపు రూ.80,000 సంపాదిస్తున్నాను అని చెబుతున్నాడు. అంతేకాదు ‘నేను ఎవరి ఒత్తిడికి లోనుకాను, నాపై ఎవరూ అజమాయిషి చేయరు..నాకు నేనే యజమాని అని వీడియోలో పేర్కొన్నాడు.
Amaravati News Navyandhra First Digital News Portal