బరువు తగ్గడం చాలా మందికి జీవితంలో ఒక పెద్ద లక్ష్యమే. కానీ, ఎప్పుడు ఆపాలి, సరైన బరువుకు చేరుకున్నామని ఎలా తెలుసుకోవాలి? మీ శరీరం మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకుంటే మీరు మీ సరైన బరువునే మెయింటైన్ చేస్తున్నారని అర్థం. వాటిని తెలుసుకుని ముందుగానే అనవసర కసరత్తులు ఆపేయడం మంచిది.. లేదంటే ఎనర్జీ లాస్ అవ్వడం ఖాయం అంటున్నారు నిపుణులు..
శారీరకంగా ఉత్సాహంగా భావించడం: మీరు శారీరకంగా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని అనిపించడం మీరు మంచి బరువులో ఉన్నారనడానికి తొలి సంకేతం. రోజంతా అలసట లేకుండా శక్తివంతంగా ఉండటం, బద్ధకం అనిపించకపోవడం వంటివి మంచి ఆరోగ్యాన్ని సూచిస్తాయి.
బరువు సంబంధిత ఆరోగ్య సమస్యలు లేకపోవడం: అధిక బరువు ఉన్నవారు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఊబకాయం నుండి కీళ్ల నొప్పుల వరకు, బరువు మీ జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. బరువు సంబంధిత ఆరోగ్య సమస్యలు లేకపోవడం మీరు సరైన బరువులో ఉన్నారని తెలియజేస్తుంది.
మీ లక్ష్యానికి దగ్గరగా ఉండటం: మీరు ప్రతిరోజూ బరువు చూసుకుంటూ ఉండవచ్చు. అయితే, మీరు నిర్దేశించుకున్న లక్ష్యం అవాస్తవంగా ఉండవచ్చు. వాస్తవానికి, అప్పటికే మీరు కావాల్సిన బరువుకు చేరుకొని ఉండవచ్చు.
బరువు తగ్గడం నిలిచిపోవడం: మీరు ఎంత ప్రయత్నించినా బరువు ఇంకా తగ్గకపోతే, మీ శరీరం అప్పటికే మంచి బరువును చేరుకుందని అర్థం చేసుకోవాలి. ఈ దశలో, మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి బరువును అదుపులో ఉంచుకోవడంపై దృష్టి పెట్టండి.
శక్తివంతంగా మారడం: కొన్నిసార్లు అలసిపోయినట్లు అనిపించడం సహజమే. కానీ, మీరు తరచుగా అలసట, నీరసంతో బాధపడకుండా, రోజంతా శక్తివంతంగా ఉంటే, మీరు మంచి శరీర బరువును కలిగి ఉన్నారని అర్థం.
జీవక్రియ మెరుగుపడటం: సరైన శరీర బరువు మిమ్మల్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడమే కాకుండా, మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కూడా మీరు సరైన బరువులో ఉన్నారనడానికి మరో ముఖ్యమైన సంకేతం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
Amaravati News Navyandhra First Digital News Portal