తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భద్రకాళి అమ్మవారి బోనాలు తాత్కాలిక వాయిదా.. ఎందుకంటే!

వరంగల్ భద్రకాళి అమ్మవారికి బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే ఇటీవల భ‌ద్రకాళి అమ్మవారి బోనాల‌కి సంబంధించి కొంత‌ మంది నుంచి అభ్యంతరాలు రావడంతో పాటు.. పలు సోషల్‌ మీడియా మాధ్యమాల్లో ఈ విషయంపై త‌ప్పుడు వార్తలు ప్రచురితమైన దృష్ట్యా, ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.

ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను.. పవిత్రమైన అమ్మవారికి ముడి పెట్టి కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు సృష్టిస్తారమోనని భావించి.. ఈ కార్యక్రమంలోకి అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారనే అనుమానంతో బోనాల నిర్వహణ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది

ఇదిలా ఉండగా భద్రకాళి అమ్మవారి ఆలయ ప‌రిధిలో శాఖాహార బోనాలే ఉంటాయని ప్రభుత్వం గతంలోనే ప‌లుమార్లు తెలియజేసిందని మంత్రి కొండా సురేఖ గుర్తుచేశారు. కానీ ప్రభుత్వం ఆలయంలో మాంసాహారంతో బోనాలు నిర్వహించేందుకు చూస్తోందని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. ఇలాంట ప్రచారాలు ప్రజల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్ళాయ‌ని.. రాజ‌కీయాల కోసం భ‌క్తుల మ‌న‌స్సుల్లో దుష్ప్రచారం నింప‌డం మంచిది ఆమె మంత్రి సురేఖ అన్నారు. ఈ కారణంతోనే ఈ నెల 22న భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించాల్సిన బోనాలు రద్దు చేయడం జరిగిందని మంత్రి సురేఖ‌ ప్రకటన విడుదల చేశారు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *