సికింద్రాబాద్ టూ అయోధ్య, కాశీ స్పెషల్ ట్రైన్.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే

కాశీ యాత్రకు వెళ్లాలని అనుకుంటున్నారా.? అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు ఈ సౌలభ్యం. అదేంటో మరి చూసేయండి. ఆ ట్రైన్ వివరాలు ఈ స్టోరీలో ఉన్నాయ్. ఓ సారి లుక్కేయండి మరి. మీకే తెలుస్తుంది.

వచ్చేనెల సెప్టెంబర్ 2న భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బైద్యనాథ్ ధామ్(SCZBG46) 9 రాత్రులు / 10 రోజులుతో అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం బయలుదేరనుంది. ఇది కవర్ చేయబడిన గమ్యస్థానాలు, స్థలాలు ఇలా ఉన్నాయి..

పూరి: జగన్నాథ టెంపుల్ & కోణార్క్ సన్ టెంపుల్.

డియోఘర్: బాబా బైద్యనాథ్ ఆలయం

వారణాసి: కాశీ విశ్వనాథ ఆలయం & కారిడార్, కాశీ విశాలాక్షి మరియు అన్నపూర్ణ దేవి ఆలయం. సాయంత్రం గంగా హారతి

అయోధ్య: రామజన్మ భూమి, హనుమాన్‌గర్హి.

ప్రయాగ్రాజ్: త్రివేణి సంగమం

ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 11:00 గంటలకు బయలుదేరి, కాజీపేట జం, వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, పెందుర్తి, విజియనగరం మీదుగా ప్రయాణిస్తుంది.

ఛార్జీ ప్రతి వ్యక్తికి..

* SL: ₹17,000/-

* 3AC: ₹26,700/-

* 2AC: ₹35,000/-

ప్యాకేజీలో రోజుకు మూడు పూటల భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయి. అలాగే ప్రతి కోచ్‌లో IRCTC సిబ్బంది అందుబాటులో ఉంటారు. IRCTC ఈ అవకాశాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులకు కల్పిస్తోంది. మరింత సమాచారం కోసం www.irctctourism.comను విజిట్ చేయవచ్చు.


About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *