చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లు! భయంతో వణుకుతున్న జనం..

బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయాని అధికారులు ప్రకటించడంతో ప్రజలు చికెన్ తినడం తగ్గించేశారు. గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెడుతుంటే.. కొన్ని చోట్లా వాటిని చేపలకు మేతగా వేస్తున్నట్లు వీడియోలు బయటికి వస్తున్నాయి. దీంతో జంన మరింత భయపడుతున్నారు.

ఇప్పటికే బర్డ్‌ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్న నేపథ్యంలో ప్రజలు చికెన్‌ తినాలంటేనే వణికిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని రోజులు చికెన్‌ తినకపోవడం ఉత్తమమని తెలిపింది. దీంతో చికెన్‌ ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఏపీలోని గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే అధికారులు కొన్ని ప్రాంతాలను రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టారు. కానీ, కొన్ని చోట్లా బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను చెరువుల్లో చేపలకు మేతగా వేస్తున్నట్లు సమాచారం. చెరువుల్లో చనిపోయిన కోళ్లను మేతగా వేస్తున్న వీడియోలను కాకినాడకు చెందిన ఎన్జీవో సభ్యులు విడుదల చేశారు.

సాధారణంగా చేపల చెరువుల నిర్వాహకులు చికెన్‌ షాపుల్లోని వ్యర్థాలను చేపలకు మేతగా వేస్తారు. కానీ, ఇప్పుడు బర్డ్‌ఫ్లూతో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతుండటంతో కోళ్లకు కోళ్లనే చేపలకు దానాగా వేస్తున్నారు. ఎలాగో బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెడుతున్నారాగా.. అదేదో మాకే ఇస్తే చేపలకు మేతగా వేసుకుంటాం అంటూ కోళ్ల ఫామ్‌ యజమానుల నుంచి చేపల చెరువుల నిర్వాహకులు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే బర్డ్‌ఫ్లూతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్న కోళ్ల ఫామ్‌ యజమానులకు.. చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టే పని తప్పుతుండటంతో వాళ్లు కూడా కోళ్ల తరలింపుకు ఓకే అంటున్నారు.

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ తో చనిపోయిన కోళ్లను వ్యాన్ ల ద్వారా జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు,, పెద్దాపురం మండలాలకు తరలించి చెరువులలో చేపలకు మేతగా వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను చెరువుల్లో చేపలకు మేత వేస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగంతో చనిపోయిన కోళ్లను.. చేపలు తింటే వాటికి కూడా ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుందని, వాటిని తింటే తమకు కూడా ప్రమాదమని భయపడుతున్నారు. వీటిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా ఎన్జీవో సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

About Kadam

Check Also

పహల్గామ్‌లో పురుషులే లక్ష్యంగా ఉగ్రదాడి.. ముగ్గురు తెలుగు వారితో సహా మొత్తం ఎంత మంది మరణించారంటే..

ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ మంగళవారం జరిగిన ఉగ్రదాడితో ఒక్కసారిగా ఉల్కిపడింది. ప్రకృతి అందాల నడుమ సంతోషంగా కొన్ని రోజులు గడిపేందుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *