బర్డ్‌ ఫ్లూ వ్యాధి ప్రాణాంతకమా? ఈ లక్షణాలు కన్పిస్తే అలర్ట్ అవ్వాల్సిందేనా..

కోళ్లతోపాటు ఇప్పుడు మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఇతర దక్షిణాది రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం సృష్టిస్తుంది. అప్రమత్తంగా లేకుంటే ఎవరైనా బర్డ్ ఫ్లూ బారిన పడవచ్చు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ వ్యాధి బారిన పడ్డారో లేదో మీకు ఎలా తెలుస్తుంది?..

ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో పలు రకాలు వ్యాధులు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఓ వైపు జీబీఎస్‌ వ్యాధి.. మరోవైపు బర్డ్ ఫ్లూ వ్యాధి. ముఖ్యంగా బర్డ్ ఫ్లూ వ్యాధితో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతుండటంతో కోళ్ల ఫారం వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోళ్లతోపాటు ఇప్పుడు మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఇతర దక్షిణాది రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం సృష్టిస్తుంది. అప్రమత్తంగా లేకుంటే ఎవరైనా బర్డ్ ఫ్లూ బారిన పడవచ్చు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ వ్యాధి బారిన పడ్డారో లేదో మీకు ఎలా తెలుస్తుంది? ఈ కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే..

బర్డ్ ఫ్లూ అనేది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా పక్షులకు, మరింత ఖచ్చితంగా చెప్పాలంటే కోళ్లకు సోకుతుంది. కుక్కలు, పిల్లులు లేదా ఇతర జంతువులు, పక్షులు వీటికి సన్నిహితంగా ఉంటే వాటికి ఈ వ్యాధి సోకవచ్చు.

కొన్ని అసాధారణ సందర్భాల్లో మనుషులకు కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. నిజానికి, H5N1 వైరస్ మనుషులకు సోకడం సర్వసాధారణం. కొన్నిసార్లు ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని తెలుస్తుంది. ఈ వైరస్ సోకిన పక్షులతో, వాటి రెట్టలతో లేదా కలుషితమైన ప్రదేశాల్లో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సంక్రమణ లక్షణాలు మొదట్లో సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉన్నప్పటికీ.. ఇది కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. ఈ వ్యాధి సాధారణ లక్షణాలు అధిక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు. శ్వాస ఆడకపోవడం.

కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఇది న్యుమోనియా, శ్వాసకోశ వైఫల్యానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది మరణానికి కూడా దారితీస్తుందని వైద్యులు అంటున్నారు. సాధారణంగా ఈ వ్యాధి సోకిన పక్షులకు 2-10 రోజుల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

బర్డ్ ఫ్లూ కి నిర్దిష్ట చికిత్స లేనప్పటికీ, ప్రాథమిక సంరక్షణ లక్షణాల నిర్వహణపై ఆధారపడి చికిత్స చేయవల్సి ఉంటుంది. ప్రధానంగా రోగనిరోధక శక్తిని పెంచడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ సమయంలో హైడ్రేటెడ్ గా ఉండటం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.

About Kadam

Check Also

PMO, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *