రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం..

రాజాసింగ్‌ రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించింది. BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై రాజాసింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్టీకి రాజీనామా ఇచ్చారు. జూన్ 30న రాజాసింగ్ రాజీనామా లేఖను పంపగా.. రాజాసింగ్‌ రాజీనామాను జేపీ నడ్డా ఆమోదించారు.

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. ఇటీవల జరిగిన BJP రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. జూన్ 30న తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు రాజాసింగ్. మరోవైపు, బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని గతంలోనే రాజాసింగ్‌ ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌‌లపై గతంలో రాజాసింగ్ అనేక ఆరోపణలు చేశారు. తాజాగా రాజాసింగ్‌ రాజీనామాను పార్టీ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.


About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *