రోడ్డుపై నిర్లక్ష్యంగా BMW కారు డ్రైవింగ్‌.. కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి!

ఢిల్లీలో కారు- బైకు ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్‌జోత్ సింగ్​ దుర్మరణం పాలయ్యారు. ఆయన భార్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రమాద సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి ఓ మహిళగా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం..

కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా విధుల నిర్వహిస్తున్న నవ్‌జోత్ ఆయన భార్య కలిసి ఆదివారం ఓ గుడికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దరించారు. కాంట్​ మెట్రో స్టేషన్​ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న బైక్​ను వెనుక నుంచి వచ్చిన బీఎండబ్ల్యూ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్​పై ప్రయాణిస్తున్న నవజోత్​ సింగ్​ ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయని, వారే బాధితులను ఆసుపత్రిలో చేర్పించారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవ్‌జోత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. ఈ ఘటనతో బాధిత కుటుంబం, నవ్​జోత్​ సహచరులు విషాదంలో మునిగిపోయారు.

ఆ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు లేవు.. అందుకే నా తండ్రి మృతి

ఈ ఘటనపై నవ్​జోత్​ కుమారుడు మీడియాతో మాట్లాడారు. తన తల్లిదండ్రులకు యాక్సిడెంట్ జరిగిందని, జీటీబీ నగర్​లోని నులైఫ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని బంధువులు ఫోన్​చేసి చెప్పారన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత తన తల్లిదండ్రులను 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ధౌలా కువాన్​ నుంచి ఎయిమ్స్​కు సమీపంలో సూపర్​స్పెషాలిటీ హాస్పిటళ్లు ఉన్నాయని, అక్కడికి తీసుకెళ్లి ఉంటే తన తండ్రి బతికే వారని అన్నారు. ఆ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు లేవని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే తన తండ్రి మరణించినట్లు ప్రకటించారని తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ, ఆమె భర్త కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ప్రమాద దాటికి పూర్తిగా ధ్వంసమైన బైక్- నుజ్జు నుజ్జైన కారు ముందుభాగం ​

హరినగర్‌లో నివసిస్తున్న నవ్​జోత్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. మోటారు సైకిల్​ను ఢీకొన్న సమయంలో బీఎండబ్ల్యూ కారు ఒక మహిళ నడుపుతోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారని వారు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు నడుపుతున్న మహిళ, ఆమె భర్త బాధితులను టాక్సీలో ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. ప్రమాదం దాటికి బైక్​ పూర్తిగా ధ్వంసమైందని, ప్రస్తుతం రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్రైమ్​బృందం ప్రమాద స్థలాన్ని పరిశీలించిందని, దర్యాప్తు కోసం ఫోరెన్సిక్​సైన్స్​లాబోరేటరీ బృందాన్ని కూడా పిలిపించామని తెలిపారు.

About Kadam

Check Also

CBSE బోర్డు కొత్త రూల్స్.. 10, 12 తరగతి పరీక్షలకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి CBSE బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *