ఛీ.. ఛీ.. ఇలా చేశావేంట్రా దుర్మార్గుడా.. మూసీలో 10 కిలోమీటర్లు వెతికినా లభించని స్వాతి శరీర భాగాలు..

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌ గర్భిణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతిని హత్య చేసిన మహేందర్.. తల, కాళ్లు, చేతులను మూసీలో పడేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో మూసీలో 10 కిలోమీటర్ల వరకు వెతికినప్పటికీ.. మృతురాలి శరీర భాగాలు లభించలేదు. వరద ప్రవాహానికి శరీర భాగాలు కొట్టుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. మృతురాలి మొండెం ప్రస్తుతం గాంధీ మార్చురీలోనే ఉంది. ఇప్పటికే నిందితుడు మహేందర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు మేడిపల్లి పోలీసులు.

పక్కా ప్లాన్‌తో మర్డర్‌ చేశాడు మహేందర్‌. భార్యను చంపేశాక ఆమె బాడీని మాయం చేసేందుకు అత్యంత క్రూరంగా వ్యవహరించాడు మహేందర్‌. మొండెం మినహా కాళ్లు చేతులు తల ముక్కలుగా నరికి ప్రతాప్‌సింగారం దగ్గర మూసీలో పడేశాడు నిందితుడు. భార్య గురించి ఎవ్వరూ ఎంక్వైరీ చేయకూడదని మరో స్కెచ్‌ వేశాడు. భార్య మిస్సయిందని బంధువులకు కట్టుకథలు చెప్పాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.

కాగా.. మూసీలో 10 కిలోమీటర్ల వరకు వెతికిన మృతురాలి శరీర భాగాలు లభించలేదని.. ఇంకా వెతుకుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గాంధీ మార్చురీలోనే మృతురాలి మొండెం ఉంది.. మృతురాలి శరీర భాగాలు ఏమై ఉంటాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్వాతి హత్యతో వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. మహేందర్ రెడ్డి తీరుపై ఆగ్రహంతో ఉన్నారు గ్రామస్థులు.. దీంతో మహేందర్ కుటుంబసభ్యులు ఊరు వదిలి వెళ్లిపోయారు. మృతురాలి మొండెం భాగాన్ని పోలీసు అధికారులు ఇవాళ కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.. అనంతరం కామారెడ్డి గూడకు స్వాతి మొండెం తరలిస్తారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

About Kadam

Check Also

కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావుది కీలక పాత్ర.. వారిద్దరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు.. కవిత సంచలన ఆరోపణలు..

కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *