అనారోగ్యం నుంచి కోలుకున్న కేసీఆర్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి..

యశోద ఆస్పత్రి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు. షుగర్, సోడియం లెవెల్స్ కంట్రోల్లోకి రావడంతో పాటు జ్వరం కూడా తగ్గడంతో ఆయన సాధారణ స్థితికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండు రోజుల పాటు ఆయన నందినగర్ నివాసంలో ఉండనున్నారు.

కేసీఆర్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. గత రెండు రోజులుగా ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే షుగర్, సోడియం లెవెల్స్ కంట్రోల్‌లోకి  వచ్చాయి. జ్వరం కూడా తగ్గడంతో ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చింది. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండు రోజుల పాటు కేసీఆర్ నందినగర్ నివాసంలో ఉండనున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ శుక్రవారం బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించారు.

అంతకుముందు కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన నీరసంతో ఆస్పత్రిలో చేరారని అందులో తెలిపారు. షుగర్ లెవల్స్ ఎక్కువగా.. సోడియం లెవల్స్ తక్కువగా ఉన్నాయని.. చికిత్స కొనసాగుతుందన్నారు. మరోవైపు కేసీఆర్ అనారోగ్యానికి గురవడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. శుక్రవారం కేటీఆర్ సైతం కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించారు. కేసీఆర్‌కు ఏంకాలేదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తమ అధినేత కోలుకుని రావడంతోె బీఆర్ఎస్ శ్రేణులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి.. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *