బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. బీజేపీతో పొత్తుకోసం కేటీర్ తమను కలిశారన్న సీఎం రమేష్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పార్టీవిలీనంపై సీఎం రమేశ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. సీఎం రమేష్ ఇంటికి నేనుకూడా వెళ్లానని.. అంత మాత్రానా పొత్తు పెట్టుకున్నట్టా అని ప్రశ్నించారు. సీఎం రమేష్ ఇంటి సీసీ ఫుటేజీ బయట పెట్టాలి డిమాండ్ చేశారు.
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. పార్టీవిలీనంపై సీఎం రమేశ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఆయన అన్నారు. పార్టీ విలీనంపై కేటీఆర్ తనను కలిశారన్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. సీఎం రమేష్ ఇంటి సీసీ ఫుటేజీ బయట పెట్టాలి డిమాండ్ చేశారు. సీఎం రమేష్ ఇంటికి నేనుకూడా వెళ్లానని.. అంత మాత్రానా పొత్తు పెట్టుకున్నట్టా అని ప్రశ్నించారు. అక్కడ పొత్తు విలీనం ప్రతిపాదన కాదు కదా.. వాళ్లలో అలాంటి చర్చలు ఎప్పుడూ ఉండవని చెప్పారు. 2014,2018 ఎన్నికల్లో BRS ఎవరి పొత్తు లేకుండానే ఎన్నికల్లో గెలిచిందని.. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఆన్నారు. గడిచిన 25 ఏళ్లలో ఒక్కసారి కూడా బీజేపీతో BRS కలవలేదని స్పష్టం చేశారు.
మరోవైపు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బాండింగ్‌పై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసింది ప్రధాని మోదీనేనని టీవీ9 క్రాస్‌ఫైర్‌లో జగదీష్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డిని సీఎం చేసింది ప్రజలు కాదని.. ఆయన్ను సీఎం చేసింది మోదీనేనని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ పార్టీ చంపి మరీ నరేంద్రమోదీ కాంగ్రెస్‌కు ప్రాణం పోశారని ఆయన అన్నారు. బండి సంజయ్‌ని తొలగించి, మీడియాకు సమాచారమిచ్చారని.. కానీ KCR కోసమే సంజయ్‌ని తొలగించినట్టు తప్పుడు వార్తలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు.
Amaravati News Navyandhra First Digital News Portal