తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి బుధవారం(డిసెంబర్ 4) బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు కౌశిక్ వెళ్లారు. అయితే, తనకు పని ఉందంటూ ఇన్‌స్పెక్టర్ వెళ్లిపోయారు. తన ఫిర్యాదు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్ వెంటపడ్డారు MLA కౌశిక్ రెడ్డి. పైగా ఇన్‌స్పెక్టర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారంటూ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కొండాపూర్‌లోని ఆయన నివాసం నుంచి తరలించారు.
అంతకుముందు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు హరీశ్‌రావు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో హరీశ్‌రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Amaravati News Navyandhra First Digital News Portal