2025-26 విద్యా సంవత్సరానికి కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT-2025) నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని IIM సూచించింది. ఇందకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, కోర్సు వివరాలు, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ వంటి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా విడుదల చేసే వివరణాత్మక నోటిఫికేషన్‌లో..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIMs) బిజినెస్ స్కూల్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT-2025) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 13, 2025వ తేదీతో ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. క్యాట్ ఆన్‌లైన్ రాత పరీక్ష నవంబర్ 30, 2025వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఒకటే రోజు మూడు సెషన్లలో నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. క్యాట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా వెబ్‌సైట్‌లో పొందుపరిచిన విద్యాసంస్థల్లో వివిధ పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
అభ్యర్ధులు ఆన్‌లైన్ దరఖాస్తులు పూరించే సమయంలో జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.2,600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.1300 చొప్పున దరఖాస్తు ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్ధులు పొందుపరిచిన రిజర్వేషన్ కేటగిరీని ఎట్టిపరిస్థితుల్లో మార్చబోమని పేర్కొంది. అందువల్ల దరఖాస్తు సమయంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రిజిస్ట్రేషన్లు సబ్‌మిట్ చేయాలని సూచించింది. రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు నవంబర్ 5 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. రాత పరీక్ష అనంతరం జనవరి 2026 మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, కోర్సు వివరాలు, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ వంటి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా విడుదల చేసే వివరణాత్మక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవాలని సూచించింది. ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
ఫలితాల విడుదల తేదీ: జనవరి 2026 తొలివారం (Tentative)
క్యాట్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 1, 2025
క్యాట్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 13, 2025
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ తేదీలు: నవంబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు
రాత పరీక్ష తేదీ: నవంబర్ 30, 2025
Amaravati News Navyandhra First Digital News Portal