టెంపుల్ సిటీ తిరుపతిలో నిన్న రాత్రి నుంచి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. శివలింగం కళ్ళు తెరిచిందని విస్తృత ప్రచారం జరుగుతుంది. జనం కూడా పెద్ద ఎత్తున చూసేందుకు ఎగబడగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ గా మారింది. తిరుపతిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. స్థానిక శివాలయంలోని శివలింగం కళ్లు తెరిచింది. ఈ వార్త తెలిసి స్థానికులంతా పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు. కళ్లు తెరిచిన పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. కొందరు ఆ అద్భుత దృశ్యాన్ని తమ మొబైల్స్‌లో రికార్డు చేశారు. …
Read More »ఆరోగ్యం కోసం ఎవరైనా నడవాల్సిందే.. చినవెంకన్న ఆలయంలో గజలక్ష్మి మార్నింగ్ వాక్.. దాని వయ్యారం చూడాల్సిందే..
మనుషుల్లా జంతువులకు, పక్షులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి తమ ఆహారం కోసం నిరంతరం తిరుగుతూ ఉంటాయి. కనుక వాటికీ శరీరానికి ఆ శ్రమ సరిపోతుంది. ఐతే జూలు , ఆలయాల్లోనూ ఉండేవి , ఇళ్లలో పెంచుకునే జంతువులకు నడక చాలా అవసరం అని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో చిన వెంకన్న ఆలయంలో గజలక్ష్మిగారు మావటిల పర్యవేక్షణలో రోజూ ఉదయమే సరదాగా వాకింగ్ చేస్తున్నారు. రోజుకు ఏడువేల అడుగులు నడిస్తే మనిషి ఆయుఃప్రమాణం పెరుగుతుందని చెబుతున్నారు. కుర్చీలకే పరిమితమయ్యే ఉద్యోగాల వల్ల వ్యాయామం, శారీరక …
Read More »తిరుమలలో కల్తీకి చెక్.. కొండపై అందుబాటులోకి ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్!
భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కల్తీకి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను మంగళవారం టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో జె. శ్యామలరావుతో కలిసి ప్రారంభించారు. ఇకపై గతంలో లాగా స్వామివారి ప్రసాదాల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు ఈవో …
Read More »ఒంటిమిట్టలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు…నిధులు కేటాయించిన టీటీడీ..మరెన్నో కీలక నిర్ణయాలు..!
తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకు గాను రూ.4.35 కోట్లు నిధులు కేటాయించింది. …
Read More »రైల్వే గేటు సమీపంలో అనుమానాస్పద రీతిలో తచ్చాడిన వ్యక్తి.. కట్ చేస్తే
తిరుపతి జిల్లా.. రేణిగుంట సమీపంలోని చింతలచేను రేల్వే గేట్.. వచ్చి పోయే ట్రైన్లు, అటుగా వెళ్లే వాహనాలతో ఆ ప్రాంతం హాడావుడిగా ఉంది.. ఈ క్రమంలో రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి అటు ఇటు తిరుగుతున్నాడు.. ఈ సమయంలోనే అతను ఏదో టెన్షన్ పడుతూ.. తేడాగా కనిపిస్తున్నాడు.. దీంతో అక్కడున్న వారికి అనుమానం కలిగింది.. అతను ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కాలేదు.. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో.. గంజాయ్ గప్పుమంటూ అసలు కథ వెలుగులోకి వచ్చింది.. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న …
Read More »శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ నెల ఆర్జిత సేవా కోటా రిలీజ్ డేట్స్ వచ్చేశాయ్.. ఇవే పూర్తి వివరాలు!
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్ల కోటా వివరాలను ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్ల కోటా వివరాలను టీటీడీ ప్రకటించింది. వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలపై స్పష్టత ఇచ్చింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల …
Read More »తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న ట్రైన్‌లో చెలరేగిన మంటలు..రెండు బోగీలు దగ్ధం!
తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రాయలసీమ నుంచి షిరిడి వేళ్లే ఎక్స్‌ప్రెస్‌ట్రైన్ లూప్‌లైన్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్తా రెండు బోగీలకు వ్యాపించడంతో ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ సమీపంలోని పాశమైలారంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా అగ్నిప్రమాదం జరిగి …
Read More »శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహ్మోత్సవాల డేట్ వచ్చేసింది.. బ్రేక్ దర్శనాల సహా పలు దర్శనాలు రద్దు.. గరుడ వాహన సేవ ఎప్పుడంటే..
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అప్పుడే సమాయత్తం అవుతోంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రణాళికలు రూపొందిస్తోంది. నిర్దేశిత సమయంలోపే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీ ఉన్నతాధికారుల తో జరిపిన సమీక్ష దిశా నిర్దేశం చేశారు. తిరుమలలోని అన్నమయ్య …
Read More »ఇదేందయ్యా ఇది.. అవినీతి అధికారులే వారి టార్గెట్.. తీరా చూస్తే వాళ్లే..
అవినీతి అధికారులే వారి టార్గెట్. కరప్షన్ ఆఫీసర్లను పట్టుకోవడం వారి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడమే వారి పని. ఇలా చాలమంది ప్రయోగం చేశారు. చాలా వరకు వారి ప్లాన్స్ సక్సెస్ అయ్యాయి కూడా. ఈ క్రమంలో ఓ వీఆర్వోను అదేవిధంగా బెదిరించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో వారి ప్లాన్‌కు ఎండ్ కార్డు పడింది. తిరుపతి జిల్లాలో నకిలీ ఆఫీసర్స్ ముఠా గుట్టు రట్టయింది. విజిలెన్స్ అధికారులమంటూ రంగంలోకి దిగిన ఫేక్ ఆఫీసర్స్.. కరప్షన్ ఆఫీసర్ టార్గెట్‌గా వ్యూహం పన్నారు. నలుగురు …
Read More »తక్షణమే ఆ ఉద్యోగులను తొలగించండి… టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలెలా ఇస్తారు? : బండి సంజయ్
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టిన రోజు సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బండి సంజయ్. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో వెయ్యి మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారుని.. వారిని వెంటనే తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో టీటీడీని రిక్వెస్ట్ చేయడం లేదు.. ఘాటుగా హెచ్చరిస్తున్నానని చెప్పారు బండి సంజయ్. ఇంకెన్ని రోజులు అన్యమతస్తులను కొనసాగిస్తారు.. వెంటనే ఫుల్ …
Read More »