తిరుపతి

తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి.. చూసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణ వచనం

కలియుగ దైవం వెంకన్న కొలువైన తిరుమల క్షేత్రం నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా ఉంటుంది. తిరుమలలో అనేక పవిత్ర ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి ఉత్సవాల్లో ఒకటి చక్రతీర్థ ముక్కోటి. తిరుమల గిరుల్లో కుమారధార, ఆకాశగంగ, పాపవినాశనం, చక్ర తీర్థం వంటి ఎన్నో పవిత్ర తీర్ధాలున్నాయి. ఈ తీర్థాలకు ఏటా ముక్కోటి ఉత్సవం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు చక్రతీర్థ ముక్కోటి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున చక్రతీర్థ ముక్కోటి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయ అర్చకులు, …

Read More »

చిన్న విషయానికే ఇంతలా శిక్ష వేయాలా..? మూగ జీవులపై ప్రతాపం.. టెంపుల్ సిటీలో కలకలం

టెంపుల్ సిటీ తిరుపతిలో శునకాలపై వరుస దాడుల వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. కొందరు శునకాలపై కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్న తీరు భయపెడుతోంది. నాలుగు రోజుల క్రితం తిరుపతిలో పెంపుడు కుక్క హత్యకు గురైన ఘటన మరువక ముందే.. ఓ పెంపుడు కుక్కను పైశాచికంగా కొట్టిన ఓ వ్యక్తి వ్యవహారం కలకలం రేపింది.. మూగ జీవి అని కూడా చూడకుండా దారుణంగా దాడి చేశాడు.. విచక్షణ కోల్పోయి మరి కర్రతో ఎలా పడితే అలా కొట్టాడు.. వివరాల్లోకెళితే.. స్కావెంజర్స్ కాలనీలో లావణ్య అనే మహిళకు చెందిన పెంపుడు …

Read More »

తిరుమలలో ప్రతి టీటీడీ ఉద్యోగికి ఉద్యోగికి నేమ్ బ్యాడ్జ్‌.. భక్తుల కోసం కీలక నిర్ణయం

Tirumala Name Badge System: టీటీడీ ఉద్యోగులకు సంబంధించి ఛైర్మన్ బీఆర్ నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. తిరుమలకు వచ్చే భక్తులతో కొందరు టీటీడీ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఉద్యోగులు భక్తుల విషయంలో బాధ్యతగా ఉండాలన్నారు. ఈ మేరకు ఈ సరికొత్త నిర్ణయంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ …

Read More »

తిరుమలలో రీల్స్‌, వీడియో షూట్స్‌పై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమలలో రీల్స్‌, వీడియో షూట్స్‌ వ్యవహారంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించింది. ఎప్పటికప్పుడు నిఘా ఉండేలా విజిలెన్స్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెడుతోంది.తిరుమలలో ఇటీవల తరచూ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. శ్రీవారి ఆలయం సమీపంలో కొందరు చేస్తున్న హడావిడితో చాలామంది భక్తులు ఇబ్బందిపడుతున్నారు. టీటీడీ నిబంధనల్ని పట్టించుకోకుండా ఫోటో షూట్‌లు చేస్తున్న ఘటనలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. దాంతో.. తిరుమలలో రీల్స్‌, వీడియో షూట్స్‌పై టీటీడీ నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. …

Read More »

తిరుమలలో అన్యమత వస్తువుల విక్రయం.. టీటీడీ నిఘా ఏమైంది.?

తాజాగా తిరుమలలో అన్యమతం గుర్తు, పేరు ఉన్న స్టీల్ కడియం అమ్మకం కలకలం రేపింది. సీఆర్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న SNC షెడ్ లోని 3 వ నంబర్ షాపులో కొనుగోలు చేసిన స్టీల్ కడియంపై అన్యమతానికి చెందిన గుర్తులు భక్తుడు కనిపెట్టాడు. దీంతో టీటీడీ అలెర్ట్ అయ్యింది. హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు. అనంతరం షాపింగ్ చేశాడు. SNC షెడ్ లోని 3 వ నంబర్ షాపులో స్టీల్ …

Read More »

తిరుపతిలోని హోటల్ కు మరోసారి బాంబు బెదిరింపులు..అధికార యంత్రాంగం అలర్ట్‌..

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అప్రమత్తమైన పోలీసులు అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు తరచూ ఇలా ప్రైవేటు హోటల్స్‌కు వస్తున్న ఫేక్‌ మెయిల్స్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు ఆగటం లేదు. తాజాగా నగరంలోని ఓ హోటల్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడంతో కలకలం రేపింది. తిరుపతి పోలీసులకు బెదిరింపు కాల్స్‌ సవాల్‌గా మారగా, సదరు హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డిసెంబర్‌ 8ఆదివారం రోజున కపిలతీర్థం రోడ్‌లోని రాజ్‌పార్క్‌ …

Read More »

పుష్ప 2 సినిమాకి.. తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధం ఏంటి?

పుష్ప అంటే వైల్డ్‌ ఫైర్‌ కావచ్చు.. కానీ అందుకు కారణం.. గంగమ్మ జాతర! పుష్ప రైజ్ నుంచి రూల్ వరకు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ వందల ఏళ్లకు ముందే.. దుష్టుల పాలిట ఊచకోతకు సంకేతం గంగమ్మ జాతర..! తాజాగా ఐకాన్ స్టార్‌ తాజా గెటప్‌తో.. వాల్డ్‌ ఫేమస్‌ అయింది తిరుపతి గంగమ్మ జాతర! అవును..పుష్ప- 2 స్టోరీ లైన్‌ ఏదైనా కానివ్వండి..! కానీ సినిమాను ఊపేసింది మాత్రం..గంగమ్మ జాతర సన్నివేశాలు! మాతంగి వస్త్రధారణలో 20 నిమిషాలపాటు థియేటర్లలో పూనకాలు పుట్టించాడు పుష్పరాజ్‌! శక్తి …

Read More »

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ..!

విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి సింగపూర్‌కు ప్రైవేటు విమాన సేవలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ గురువారం గాలిలోకి ఎగిరింది. టెంపుల్ సిటీ తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలు అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో తిరుపతి నుంచి సింగపూర్‌కు ప్రైవేట్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం(డిసెంబర్ 6) ఉదయం 5 …

Read More »

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇకపై భక్తులు కోరినన్ని లడ్డూలు

వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చిన శ్రీ మహా విష్ణువు ఇలవైకుంఠం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించి కోనేతిరాయుడి అనుగ్రహం పొందాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. స్వామివారి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. అంతే ప్రాముఖ్యత శ్రీవారి ప్రసాదం లడ్డుకి ఉంది. ఎవరైనా తిరుపతి వెళ్తున్నారు అంటే లడ్డు తీసుకుని రా అని చెబుతారు. దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి ఎంత ఫేమసో.. శ్రీవారి లడ్డూ కూడా అంతే ఫేమస్. ఈ లడ్డు రుచి గురించి …

Read More »

ISRO: మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఇస్రో.. ఏకంగా సూర్యుడిపై అధ్యయనం కోసం..!

ఈ ప్రోబా..3 ఆకాశంలో కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు యూరోపియన్ ప్రయోగాన్ని తలపెట్టింది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భారత్‌కు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటడ్(NSIL) సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా యూరోపియన్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఇస్రో శ్రీహరికోట నుండి డిసెంబర్ నాలుగవ తేదీ సాయంత్రం నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించనున్నారు. తిరుపతి జిల్లా …

Read More »