విశాఖపట్నం

విశాఖపట్నంకు ప్రపంచస్థాయి గుర్తింపు.. జియో పార్కు హోదా?, వివరాలివే

విశాఖపట్నంకు మరో అరుదైను గుర్తింపు లభించే అవకాశం ఉంది. యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా 48 దేశాల్లోని 200 ప్రాంతాలను జియో పార్కులుగా గుర్తించగా.. విశాఖకు కూడా ఆ గుర్తింపు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన దేశంలోని ఆరు ప్రదేశాలను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించగా.. వాటిలో జబల్‌పూర్‌ జియోపార్కు, సిక్కిం మామెలిలో పోషిల్‌ పార్కు, కేరళ వరకల జియోపార్కు, రాజస్థాన్‌లో రామగర్‌ జియోపార్కు, లద్దాఖ్‌లో లామయూరు మ్యూజియం, విశాఖపట్నం అర్బన్‌ జియో పార్కులు ఉన్నాయి. ఈ మధ్య ఢిల్లీలో యునెస్కో- జీఎస్‌ఐ సంయుక్తంగా …

Read More »

ఏపీలో ‘లులు’ను మేమే వద్దన్నాం.. కారణాలు ఏంటో చెప్పిన మాజీ మంత్రి బొత్స

ఆం ధ్రప్రదేశ్‌లో లులు ప్రాజెక్టుపై మరోసారి చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోగా.. తాజాగా లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని చెప్పారు. అయితే గత ప్రభుత్వం లులును వెళ్లగొట్టిందనే విమర్శలు రావడంతో.. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లులు గ్రూపు వెళ్లిపోవడానికి కారణాలను చెప్పారు. విశాఖలో లులు ప్రాజెక్టును …

Read More »

పైకి చూస్తే పాన్ షాపు.. రోజూ జనాలతో రద్దీ, అనుమానంతో వెళ్లి చూస్తే!

విశాఖపట్నంలో గంజాయి చాక్లెట్లు కలకలంరేపాయి.. ఇటీవల పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. చాక్లెట్ల రూపంలో గంజాయిని ప్యాక్ చేసి అమ్మేస్తోంది.. ఓ పాన్‌లో షాపులో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నంలోని క్రాంతిథియేటర్‌ ఎదురుగా మనోజ్‌కుమార్‌చౌదరి పాన్‌షాప్‌ నిర్వహిస్తున్నాడు. అతడి షాపులో గంజాయితో తయారుచేసిన చాక్లెట్లను రహస్యంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కగా సమాచారం వచ్చింది. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ పాన్ షాపులో దాడులు చేయగా.. అమ్మకానికి సిద్ధంగా ఉంచి 133 గంజాయి చాకెట్లు (660 గ్రాములు) దొరికాయి.చాకెట్లను …

Read More »

సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ విలీనంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

సెయిల్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి, నర్సాపురం బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణపై ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నామని, ప్లాంట్ నష్టాలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్యాకేజీలు ఇవ్వలేదని కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తేల్చి చెప్పారు. సెయిల్‌లో వీలీనానికి కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్నాయన్న ఆయన.. అయినా …

Read More »

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బదులుగా.. కేంద్రం కొత్త ప్లాన్!

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా నష్టాల్లో కొనసాగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్‌లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా సెయిల్‌లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. …

Read More »

విశాఖపట్నం వ్యక్తికి క్షమాపణలు చెప్పిన మంత్రి లోకేష్.. ఆ కారుకు ఖర్చు మొత్తం భరిస్తానని హమీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగిందని ఒప్పుకుంటూనే.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. సామాన్యుడు చేసిన ట్వీట్‌కు స్పందించి సారీ చెప్పి పెద్ద మనసు చాటుకున్నారు. మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు.. అయితే మంత్రి కాన్వాయ్‌లోని వాహనం రోడ్డుపక్కన నిలిపి ఉన్న కారును ఢీకొట్టి వెళ్లింది. అదే సమయంలో అక్కడే ఉన్న కారు యజమాని కళ్యాణ్ ఈ విషయాన్ని గమనించారు. ఈ విషయాన్ని భరద్వాజ్ ఎక్స్ ( ట్విట్టర్)‌లో లోకేష్‌కు చెప్పారు. …

Read More »

కేంద్రం కీలక నిర్ణయం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వేల కోట్లు!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం మరో రూ.2500 కోట్లు కేటాయించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. ముడిపదార్థాల కొరత కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని పెంచేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మరో రెండున్నర వేల కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. గురువారమే రూ.500 కోట్లు మంజూరు చేయగా.. వాటితో పాటుగా మరో రెండున్నర వేలకోట్లు ఇవ్వనుంది. అయితే ఇక్కడే కేంద్రం ఓ షరతు పెట్టింది. మొదటగా విడుదల చేసిన …

Read More »

విశాఖపట్నం-దుర్గ్ వందేభారత్ ఛార్జీల వివరాలివే.. 60 కిమీ దూరానికి ఎంతో తెలిస్తే!

విశాఖపట్నం-దుర్గ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రైలుకు సంబంధించిన ఛార్జీలపై క్లారిటీ వచ్చింది.. అయితే ఈ ఛార్జీలు సామాన్యులకు కాస్త భారంగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ-విజయనగరం మధ్య దూరం 60 కిలోమీటర్ల దూరానికి వందేభారత్‌లో ఛైర్‌కార్‌ ఛార్జీ రూ.435 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌లో రూ.820గా ఛార్జీలు ఉన్నాయి. అదే సాధారణంగా ఆర్టీసీ డీలక్స్‌ బస్సులో దాదాపు రూ.100 ఛార్జీ ఉంటుంది. ఇలా చూస్తే.. వందేభారత్‌లో నాలుగు రెట్లు అధికం అంటున్నారు. విశాఖపట్నం నుంచి వందేభారత్‌ రైలు ఛార్జీల వివరాలు ఇలా …

Read More »

విమానాశ్రయాల్లో సరికొత్త విధానం.. ఇకపై సెకెన్లలోనే ఇమ్మిగ్రేషన్ పూర్తి!

విమానాశ్రయాల్లో మరింత వేగంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తిచేసేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ప్రయోగాత్మకం చేపట్టిన ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌ను దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ అమలుచేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలోని ప్రధాన 20 ఎయిర్‌పోర్టులకు దీనిని విస్తరిస్తున్నట్టు పేర్కొంది. ఈ విధానం వల్ల ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సెకెన్ల నుంచి గరిష్టంగా 30 నిమిషాల్లోనే పూర్తవుతుందని తెలిపింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జూన్ 22న ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్‌ (FTI-TTP)ను కేంద్ర …

Read More »

వైఎస్ జగన్‌తో సెల్ఫీ.. మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు చిక్కులు

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సెల్ఫీ తీసుకుని మహిళా కానిస్టేబుల్‌ను చిక్కుల్లో పడ్డారు. గుంటూరులో జిల్లా జైలు దగ్గర బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌తో సెల్ఫీ తీసుకున్నారు.. జైలులో మహిళా కానిస్టేబుల్‌ ఆయేషాబానుకు ఛార్జి మెమో ఇస్తామని జైలర్‌ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌, విజయవాడ డిప్యూటీ మేయర్‌ భర్త శ్రీనివాస్‌రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు.. అనంతరం జైలు బయట వచ్చిన …

Read More »