ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులు.. మంత్రి కీలక వ్యాఖ్యలు

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొత్త ఎయిర్‌పోర్టుల ప్రస్తావన ఎక్కువగా జరుగుతోంది.మరీ ముఖ్యంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు గురించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సుకు నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్.. ఏపీలో నూతన విమానాశ్రయాల గురించి కీలక …

Read More »

ఏఆర్ డెయిరీకి టీటీడీ షాక్.. కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన విషయాలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరో మలుపు తిరిగింది. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్‌ ప్రొడెక్ట్స్‌ లిమిటెడ్‌పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీకి నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మే 15న నెయ్యి సప్లై కోసం ఆర్డర్ ఇచ్చామని.. జూన్ 12, 20, 25 తేదీల్లో పాటు జులై 6న నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా …

Read More »

విశాఖపట్నం వ్యక్తికి క్షమాపణలు చెప్పిన మంత్రి లోకేష్.. ఆ కారుకు ఖర్చు మొత్తం భరిస్తానని హమీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగిందని ఒప్పుకుంటూనే.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. సామాన్యుడు చేసిన ట్వీట్‌కు స్పందించి సారీ చెప్పి పెద్ద మనసు చాటుకున్నారు. మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు.. అయితే మంత్రి కాన్వాయ్‌లోని వాహనం రోడ్డుపక్కన నిలిపి ఉన్న కారును ఢీకొట్టి వెళ్లింది. అదే సమయంలో అక్కడే ఉన్న కారు యజమాని కళ్యాణ్ ఈ విషయాన్ని గమనించారు. ఈ విషయాన్ని భరద్వాజ్ ఎక్స్ ( ట్విట్టర్)‌లో లోకేష్‌కు చెప్పారు. …

Read More »

నెల్లూరులో గోల్డెన్‌మెన్ సందడి.. ఒంటి నిండా బంగారమే, ఎన్ని కేజీలో తెలిస్తే!

నెల్లూరులో గోల్డ్‌మెన్ సందడి చేశారు.. ఒంటి నిండా బంగారంతో నగరంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన్ను చూసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు జనాలు పోటీపడ్డారు. కర్ణాటకకు చెందిన గోల్డ్‌మెన్‌ రిజమూన్‌ నెల్లూరు వచ్చారు. ఆయన ఒంటిపై ఏకంగా 2 కిలోలకుపైగా బంగారంతో కనిపించారు. రిజమూన్‌ కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో 31 ఏళ్లుగా స్థిరపడ్డారు. ఆయనకు అక్కడ 30 ఎకరాల కాఫీ ఎస్టేట్‌ ఉంది.. రెడ్‌లన్స్‌ కంపెనీ రీజినల్‌ మేనేజర్‌గా ఆరు రాష్ట్రాలు చూస్తున్నారు. తనకు ఐదు భాషలు వచ్చని.. తెలుగు కూడా త్వరలో నేర్చుకుంటానని చెబుతున్నారు రిజమూన్. సింగర్‌ …

Read More »

ఏపీలో మహిళలకు అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి, లేకపోతే పథకం రాదు!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. తాజాగా మరో హామీ అమలుకు సిద్ధమైంది.. దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీంతో అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.. రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే మార్గదర్శకాలు, విధి విధానాలను రూపొందించి వివరాలన వెల్లడిస్తారు. ఏపీలో మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హత ఉండాలంటే.. ముందుగా ఈ-కేవైసీ …

Read More »

ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఇవాళ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు. అయితే కోస్తా జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి అంటున్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఇవాళ అల్లూరి …

Read More »

టీడీపీ ఎంపీ ఇంట తీవ్ర విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం జరిగింది. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి సతీమణి, మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు. ఆమె అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్వతమ్మ మరణం మాగుంట కుటుంబంలో విషాదం నింపిందన్నారు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి. పార్మతమ్మ తనకు తల్లితో సమామని.. ఆమె మరణం తీరని లోటన్నారు. ఏప్రిల్‌ నెలలో మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. …

Read More »

విజయవాడ వరదలో సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు నష్టపోయారా.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు అపార నష్టాన్న మిగిల్చాయి. విజయవాడతో పాటుగా పలు జిల్లాల్లో వరద దెబ్బకు ఇళ్లు నీటమునిగాయి.. దీంతో ఇళ్లలో వస్తువులతో పాటుగా కొంతమంది విద్యార్థుల సర్టిఫికెట్లు, ఈ వరదల్లో ముఖ్యంగా ఆధార్, బర్త్, డెత్, మ్యారేజీ, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఇతర సర్టిఫికెట్లు నీళ్లలో పాడైపోయాయి. ఇలా సర్టిఫికేట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. …

Read More »

తిరుమల లడ్డూ ప్రసాదంపై సిట్ ఏర్పాటు.. ఆయనకే చీఫ్ బాధ్యతలు, మరో ఇద్దరు IPSలు

తిరుమలలో లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సిట్ ఏర్పాటైంది. ప్రధానంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం, ఇతర అక్రమాలు, అపచారాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై సిట్ విచారణ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ సిట్‌ చీఫ్‌గా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. సిట్‌లో సభ్యులుగా విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో పాటు తిరుపతి అడ్మిన్‌ ఏఎస్పీ వెంకట్రావు, అలిపిరి సీఐ రామ్‌కిషోర్‌, మరికొంతమంది డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి …

Read More »

ఏపీలో వారందరికి ఉద్యోగాలు.. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కారుణ్య నియామకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పంచాయతీరాజ్‌ శాఖలో కారుణ్య నియామకాల జాబితాలో వేచి చూస్తున్న వారిని జిల్లా కలెక్టర్ల కామన్‌ పూల్‌లోని ఖాళీల్లో నియమించే అంశంపై.. రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ ఉన్నతాధికారులతో చర్చించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్‌ ఉద్యోగులు, వాటి పరిధిలోని స్కూళ్లలో ఉపాధ్యాయులు మరణిస్తే.. వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంపై పంచాయతీరాజ్‌ …

Read More »