ఆపదమొక్కుల స్వామికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి తిరుమల కొండకు చేరతారు. మొక్కులు చెల్లించేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతారు. ముడుపులు కట్టి కొండ మెట్లు ఎక్కి కోనేటి రాయుడు దర్శనం కోసం తిరుమల కొండకు చేరి భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లిస్తారు. అయితే భక్తులను ప్రవేయిట్ వాహనదారులు అధిక చార్జీల పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఈ దందాకు చెక్ పెట్టేందుకు టీటీడీ ప్లాన్ చేసింది.ఏడుకొండల మీద కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కొందరు మెట్ట …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ ప్రముఖుల కీలక భేటీ.. ఎప్పుడంటే!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ పెద్దటు, నిర్మాతలు, నటులు భేటీ కానున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు వారు సీఎం చంద్రబాబును కలవనున్నారు. తొలుత డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో భేటీ అయిన ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలవనున్నారు సినీ పెద్దలు. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇంత వరకు సినీ ప్రముఖులు సీఎంను కలిసింది లేదు. కేవలం డిప్యూటీ సీఎం పవన్‌ను మాత్రమే కలిశారు. అయితే, ఇటీవల థియేటర్ల బంద్‌కు సంబంధించిన విషయంపై స్పందించిన నటుడు, ఏపీ …
Read More »ఒకే కుటుంబంలో ఐదుగురికి తల్లికివందనం.. ఆనందంలో కుటుంబం!
ఏపీలో అధికారంలోకి వచ్చిన ఇటీవలే ఏడాది పాలనను పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం పాలనలో తమదైన మార్క్‌ను చూపుతోంది. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకువెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా సూపర్ సిక్స్ పథకాల్లొ ఒకటైన తల్లివందనం పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి 15వేల రూపాయలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇప్పటికే విద్యార్థుల తల్లుల ఖాతాలోకి నగదు జమ చేసింది. అయితే ఇది ఒకరిద్దరు ఉన్న విద్యార్ధుల తల్లిదండ్రులకు ఊరట కలిగించే …
Read More »వచ్చిందమ్మా నైరుతి.. తెలుగు రాష్ట్రాలను తాకిన రుతుపవనాలు
ప్లాస్ న్యూస్ ఏంటంటే.. నైరుతి రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. అవి ఈ విషయాన్ని వెదర్ డిపార్ట్‌మెంట్ కన్ఫామ్చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయని.. రాబోయే మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం.. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ముంబైతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు, బెంగళూరుతో సహా కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ …
Read More »పెన్నా నది వద్దకు వెళ్లిన స్థానికులు.. కనిపించింది చూసి సంభ్రమాశ్చర్యం
నెల్లూరు జిల్లాలో అరుదైన ఘటన వెలుగుచూసింది. జొన్నవాడ కామాక్షితాయి టెంపుల్ సమీపంలోని పెన్నా నదిలో అమ్మవారి విగ్రహం బయటపడింది. సరిగ్గా కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే నదిలో అమ్మవారి విగ్రహం బయటపడటంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి.. శక్తి స్వరూపినిగా ఉన్న అమ్మవారి రూపాన్ని చూసి పూజలు నిర్వహిస్తున్నారు. విగ్రహాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి విగ్రహం ఎక్కడి నుంచైనా కొట్టుకువచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి, కామాక్షితాయి అమ్మవారి …
Read More »కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష తేదీ విడుదలైంది. మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022లో నాటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా.. మొత్తం 5,03,487 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 22న వీరందరికీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా 91,507 మంది అర్హత సాధించారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించారు. ఇక ఇందులోనూ అర్హత సాధించిన వారికి తుది రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను జూన్ 1న …
Read More »కరోనా కేసులు పెరుగుతున్నాయ్.. జర జాగ్రత్త..! రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..
కనుమరుగై పోయిందనుకుంటున్న వేళ కరోనా రీ ఎంట్రీ మళ్లీ కలకలం రేపుతోంది. కొత్త రూపంలో పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులే అందుకు నిదర్శనం. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లోనే కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. NB.1.8.1, LF.7 అనే కరోనా వేరియంట్స్ ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే.. జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో …
Read More »అక్రమ మైనింగ్ కేసులో ఏపీ మాజీ మంత్రి కాకాణి అరెస్ట్
క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం వంటి అక్రమాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. గత కొంతకాలంగా పరారీలో ఉన్న కాకాణిని కేరళలో అదుపులోకి తీసుకున్నారు.ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణిని నెల్లూరు పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి నెల్లూరు తీసుకువచ్చే అవకాశం …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి!
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై సొమవారం ఉదయం వేగంగా వచ్చిన లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా మరొకరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కారు, లారీ ఢికొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన తూర్పుగోదావరి …
Read More »నైరుతి రుతుపవనాల రాక.. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!
కేరళా తీరాన్ని తాకిన నైరుతు రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర కర్ణాటకాలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా తూర్పు వైపుకు కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.కేరళా తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తూ పశ్చిమ మధ్య తూర్పు మధ్య అరేబియా …
Read More »