ఆంధ్రప్రదేశ్

తప్పిపోయిన విద్యార్థి.. అనుమానాస్పదస్థితిలో మృతదేహం.. విద్యార్థి మనోజ్‌ కాకుంటే.. డెడ్‌బాడీ ఎవరిది?

అల్లూరి జిల్లాలో ఓ విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. మంప- కొయ్యూరు సమీపంలో అనుమానాస్పదస్థితిలో మృతదేహం లభ్యమవడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఆ తర్వాత.. మృతదేహం మనోజ్ దేనంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే.. ఆ మృతదేహం తమ బిడ్డది కాదని తల్లిదండ్రులు, బంధువులు చెప్తుండడం సంచలనంగా మారింది. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం గిరిజన గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతల మనోజ్‌.. వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అయితే.. మనోజ్‌ మృతి చెందినట్లు పోలీసులు సమాచారం …

Read More »

ఆర్టీసీ డ్రైవర్ లేకుండానే పరుగులు పెట్టిన బస్సు.. తీరా కిలోమీటర్ల దూరంలో ప్రత్యక్షం..!

బస్సు డిపోలో ఉండాల్సిన ఆర్టీసీ బస్సు కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడ్డ బస్సు డ్రైవర్, అధికారుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు బస్సు జాడ గుర్తించారు. అయితే, బస్సు ఇక్కడికి ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. డ్యూటీ ఎక్కేందుకు తెల్లవారుజామున డిపోకు వచ్చిన ఆ డ్రైవర్‌కు.. అక్కడ ఉండాల్సిన ఆర్టీసీ బస్సు కనిపించకుండాపోయింది. ఇటు అటు చూశాడు. కనిపించలేదు. …

Read More »

పార్శిల్‌లో డెడ్‌బాడీ కేసు: అసలు హంతకుడు అతడే! వదిన ఆస్తి కోసం మరిది దారుణం

పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపిన చెక్క పెట్టెలో డెడ్ బాడీ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. వదిన ఆస్తిపై కన్నేసిన మరిది.. డెడ్ బాడీ సాయంతో బ్లాక్ మెయిల్ చేద్దామని అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరగడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధంలేని ఓ కూలి ఇతగాడి పన్నాగానికి బలై శవమయ్యాడు..పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెక్కపెట్టెలో గుర్తు తెలియని మృతదేహం పార్శిల్‌ వచ్చిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మృతదేహం …

Read More »

విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి స్కూళ్లకు క్రిస్మస్‌ సెలవులు! మొత్తం ఎన్ని రోజులంటే

తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్‌ విద్యార్థులకు నేటి నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా సెలవులు ఇస్తూ ఇప్పటికే రెండు రాష్ట్రాల విద్యాశాఖలు ప్రకటనలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం నుంచే స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా స్కూళ్లలో రేపు, ఎల్లుండి పబ్లిక్ హాలిడేలుగా ప్రకటించారు. దీంతో డిసెంబర్‌ 25, 26 తేదీల్లో పబ్లిక్ హాలీడేస్‌గా ప్రకటించారు. డిసెంబర్‌ 25న …

Read More »

అబ్బురపరుస్తున్న 400 ఏళ్ల నాటి రామదుర్గం చర్చి.. ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు

దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పురాతన చర్చిలున్నాయి. అలాంటి చర్చి ఒకటి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో ఉంది. ఈ చర్చికి నాలుగు శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. ఆలూరు మండలంలోని రామదుర్గం ప్రార్థన మందిరాన్ని 400 ఏళ్ల క్రితం నిర్మించారు.1780లో ఫాదర్ సెయింట్ రామదుర్గం చర్చిని గోవా రిజిస్టర్లో రాయించారు. ఇది జరిగిన తర్వాత 150 ఏళ్లకు ముందు.. ఆదోనికి చెందిన మినుములు చిన్న నాగప్ప పెద్ద నాగప్ప రామదుర్గంలో పునీత అన్నమ్మ …

Read More »

సీజన్‌లో భలే గుడ్ న్యూస్.. అరకు వెళ్లాలనుకుంటున్నారా.. ఇదిగో స్పెషల్ ట్రైన్

ఆంధ్రా ఊటీకి పోటెత్తుతున్నారు పర్యాటకులు. సీజన్‌ పీక్‌కు చేరడంతో వంజంగి హిల్స్‌లో సూర్యోదయం సందర్శకులను కట్టిపడేస్తోంది. పచ్చని కొండల మధ్య తేలియాడుతూ ఆకట్టుకుంటోంది. తాజాగా అరకు వెళ్లాలనుకునే పర్యాటకులకు తూర్పు కోస్తా రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అదెంటో తెల్సా…మన్యంలో ప్రకృతి పరవశిస్తోంది. అరకు అందాలు కనువిందు చేస్తున్నాయి. వెండిమబ్బులు గాల్లో తేలుతున్న అక్కడి ఆహ్లాదకర వాతావరణం, అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అరకు లోయతో పాటు లంబసింగి, వంజంగిలోని ఈ మేఘాల కొండలు మైమరిపిస్తున్నాయి. ఆకాశమే దిగివచ్చిందా అన్నట్లు ఈ అద్భుత దృశ్యాలు …

Read More »

ఏపీలో మళ్లీ వానలు.. కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన!

ఆంధ్రప్రదేశ్‌ను తుఫాన్లు వెంటాడుతున్నాయా?.. గత కొన్నాళ్లుగా ఏపీని వరుసగా తుఫాన్‌లు వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆవర్తనాలతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు దంచికొట్టాయి. తాజాగా.. ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది.బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలలో భారీ వర్షాల కురిసే అవకాశముందని ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడన …

Read More »

 చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో జనవరి నుంచే పనులు ప్రారంభం..

రాజధాని కోసం చేసే అప్పులు ఎలా తీరుస్తారు.. దీనిపై జనంలో గాని, అపోజిషన్ పార్టీల్లో గానీ ఉండే అనుమానాలేంటి.. కూటమి సర్కార్ ఇస్తున్న క్లారిటీలేంటి..? ఇదే కాదు.. అమరావతి నిర్మాణంపై ఉండే అన్ని డౌట్లనూ పటాపంచలు చేశారు మంత్రి నారాయణ. సీఆర్‌డీఏ కీలక సమావేశం తర్వాత.. బేఫికర్ అంటూ భరోసానిచ్చారు..ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలన్న లక్ష్యంతో దూసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే సిఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డిఎ 44వ సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో జరగబోయే నిర్మాణాలకు అనుమతులపై కీలక …

Read More »

హాలో ఆంధ్రా.. అనకాపల్లిలో మరోసారి ప్రధాని ఆవాజ్‌.. ఎప్పుడంటే..?

మూడోసారి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి విశాఖకు రాబోతున్నారు. మోదీ పర్యటనతో ఏపీవాసుల పదేళ్ల కల నెరవేరబోతోంది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి అభివృద్ధి కార్యాక్రమాల్లో పాల్గొంటారని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన దాదాపు ఖరారైంది. జనవరి ఎనిమిదిన ప్రధాని మోదీ అనకాపల్లి వస్తారని పార్లమెంటు సభ్యులు సీఎం రమేశ్ ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్.. సహా …

Read More »

టెన్త్‌ విద్యార్ధులకు అత్యధిక మార్కులు వచ్చేలా.. వంద రోజుల ప్రణాళిక అమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు మార్చి నెలలో జరగనున్న పబ్లిక్ పరీక్షల కోసం సర్కార్ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తుంది. పరీక్షల్లో విద్యార్ధులు అత్యుత్తమ మార్కులు సాధించేలా అదనపు తరగతులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 17 నుంచి …

Read More »