ఆంధ్రప్రదేశ్

లిక్కర్ స్కామ్ కేసులో సిట్‌ దూకుడు.. ఇవాళ విచారణకు విజయసాయి రెడ్డి!

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. కేసులో కీలక సూత్రధారులుగా భావించిన వారికి నోటీసులు ఇచ్చి వరుసగా విచారణకు పిలుస్తున్నారు. ఈ క్రమంలోనే సాక్షిగా ఇవాళ విచారణకు హాజరుకావాలని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈనెల 15న సిట్‌ నోటీసులు జారీ చేసింది. అయితే 17వ తేదీనే సిట్‌ విచారణకు హాజరవుతానన్న విజయసాయి రెడ్డి..చివరి నిమిషంలో డుమ్మా కొట్టారు. ఈ రోజు విచారణకు వస్తానంటూ మరోసారి సిట్‌కి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన సిట్‌ ముందు విచారణకు …

Read More »

వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. దరఖాస్తు విధానంలో కీలక మార్పులు చేసిన విద్యాశాఖ..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ విడుదలకు రూట్ క్లియర్‌ అవుతోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన సర్కార్.. రాజప్రతిని గవర్నర్ ఆమోదముద్ర కోసం పంపించారు. గవర్నర్ ఆమోదిస్తున్నట్లు సంతకం పెడితే ఇక ఎస్సీ వర్గీకరణ పూర్తైనట్లే. ఆ మరుసటి రోజే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడనుంది. అయితే డీఎస్సీ దరఖాస్తు విధానంలో అధికారులు ఈసారి కొన్ని కీలక మార్పులు తీసుకొస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియను ఏ, బీ విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు. …

Read More »

డబ్బుంటే చాలదు.. కష్టం చూసి స్పందించే మనసుండాలి.. మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. ఆ గిరిజనుల మోముల్లో ఆనందం..!

ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ అడవి తల్లి బాట ‘ కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో పర్యటించారు. డుంబ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామస్తుల రోడ్డు కష్టాలు తీర్చేందుకు అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ గ్రామస్తులతో మాట్లాడారు వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలోనే.. పవన్ కళ్యాణ్ గిరిజనుల ఆ కష్టాన్ని చూసి చలించిపోయారు. వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. కనీస సౌకర్యాలు వాళ్లకు ఆమడ దూరం.. రహదారుల మాట …

Read More »

వారెవ్వా.. ఏపీకి కావాల్సింది ఇదికదా.. అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..!

అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ 60 శాతం నిధులు అందిస్తున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం మిగతా ఖర్చు భరిస్తుంది. 2027 నాటికి పూర్తి కానున్న ఈ స్టేడియంలో సంవత్సరానికి 10 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగనున్నాయి. భవిష్యత్తులో ఏపీకి ఐపీఎల్ టీమ్ కూడా లభించే అవకాశం ఉంది.ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అమరావతిలో స్టేడియం నిర్మించాలని ఏపీ మంత్రి నారా లోకేష్‌, బీసీసీఐ కార్యదర్శి జైషాను కలిసిన సమయంలో కోరారు. దీంతో.. …

Read More »

ఆర్థికంగా చితికిపోయినా రాష్ట్రాన్ని ఆదుకోండి.. ఆర్థిక సంఘానికి ఏపీ సీఎం విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌కు అండగా.. అభివృద్ధికి ఊతమిచ్చేలా సాయం చేయాలని ఆర్థిక సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. 10 నెలలుగా తీసుకున్న చర్యలు.. అమలు చేసిన విధానాలను వివరించారు. అలాగే రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వివరిస్తూ వీడియో ప్రదర్శించారు. ఆర్థికంగా చితికిపోయినా రాష్ట్రాన్ని ఆదుకోండి.. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌నిర్మాణానికి అండగా నిలవాలని 16వ ఆర్థిక సంఘం సభ్యులను కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీని ప్రత్యేకంగా చూసి ఆర్థికంగా సాయం చేయాలన్నారు. స్వర్ణాంధ్ర 2047ప్రణాళికకు భరోసానివ్వాలని కోరారు. రాష్ట్ర ఆర్థికస్థితి, రెవెన్యూలోటు, కొత్త …

Read More »

అతి సామాన్య నేత.. సాదాసీదాగా జీవిస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఇకలేరు..!

కర్నూలు జిల్లా ఆలూరు మాజీ శాసనసభ లోక్‌నాథ్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు. హైదారాబాద్ మల్లారెడ్డి ఆసుపత్రిలో బుధవారం(ఏప్రిల్ 16) మధ్యాహ్నం చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతకకాయాన్ని సొంత గ్రామం ఆలూరు మండలం మొలగవళ్లి గ్రామానికీ తీసుకొనే వచ్చే పనిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. లోక్ నాథ్ మరణవార్త వినిన వెంటనే తన సొంత గ్రామం మొలగవల్లి అలాగే ఆలూరు లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లోక్‌నాథ్ మొలగవళ్లి గ్రామంలో విద్యను అభ్యసించారు. అప్పట్లోనే ఓల్డ్ SSLC వరకు చదువుకున్నారు. ఉన్నత విద్య కోసం …

Read More »

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?

జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జరుగగా.. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు జరిగాయి. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్‌-1 (బీఈ/ బీటెక్‌) పరీక్షలు, ఏప్రిల్‌ 9వ తేదీన పేపర్‌-2ఏ, 2బీ (బీఆర్క్‌/బీ ప్లానింగ్‌) ప్రవేశ పరీక్షలు జరిగాయి. అయితే ఈ రెండు విడతల పరీక్షల్లోని …

Read More »

3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్‌ ద్వారా జిల్లాలవారీగా జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం 20 వేలకు పెంచింది ప్రభుత్వం. ఏప్రిల్ 26న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీలో మంత్రులకు క్లాస్‌ తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను మంత్రులు …

Read More »

మే 2న అమరావతికి ప్రధాని మోదీ.. రాజధాని పునః నిర్మాణ పనులకు శ్రీకారం..

తెలుగు ప్రజలందరూ ఎప్పటినుంచో ఉత్కంఠగా ఎదురు చూసే సమయం రానే వచ్చింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విచ్చేయనున్నారు. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఓ కీలక మలుపుగా నిలవనుంది. ఎందుకంటే, చాలా కాలంగా ఎదురుచూస్తున్న అమరావతి పునఃనిర్మాణ పనులకు మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ పర్యటన నిర్ధారణ కాగానే ముఖ్యమంత్రి కార్యాలయం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పర్యటనపై మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి, …

Read More »

ఆరేళ్లుగా పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు.. కట్‌చేస్తే.. కటకటాలపాలయ్యాడు!

2019 నుంచి పోలీసులకు చిక్కకుండా, దారి దోపిడీలు, దౌర్జన్యాలు, దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాడికి నంద్యాల పోలీసులు చెక్‌ పెట్టారు. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత పాణ్యం మండంలోని సుగాలిమెట్ట గ్రామంలో చెంచు హనుమంతు అనే కేటుగాడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అతను కరుడు గట్టిన నిందితుడు, ఒకటి రెండు కాదు ఏకంగా 22 కేసుల్లో ముద్దాయి.  2019 నుంచి నంద్యాల,  గుంటూరు జిల్లాల్లో యదేచ్చగా దారి దోపిడిలు, చోరిలకు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న చెంచు హనుమంతును ఎట్టకేలకు నంద్యాల పోలీసులు అరెస్టు చేసి …

Read More »