ఇద్దరి మనసులు కలిశాయి. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే రెండు నెలల క్రితం వారు ఉంటున్న ఇంటి ఓనర్ సహాయ సహకారాలతో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలల క్రితం రమ్యశ్రీకి కూడా నిఖిల్ రెడ్డి చేస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించాడు. తమకు నచ్చినవారితో జీవితం కొనసాగించాలని ప్రేమ వివాహం చేసుకుని.. తమ జీవితాన్ని ఎంతో హాయిగా గడపాలని ఎన్నెన్నో కలలు కన్న ఒక జంట.. వివాహమైన రెండు నెలలకే వారి జీవితాలకు చివరి రోజులు వచ్చేస్తాయని ఊహించలేకపోయారు. ఒకే చోట …
Read More »సత్యసాయి గ్రామంలో మ్యూజిక్ మాస్ట్రో AR రెహమాన్ సందడి.. సాయి సంఫనీ ఆర్కెస్ట్రాపై ప్రశంసల జల్లు!
సత్యసాయి గ్రామంలో నిర్వహించిన సాయి సింఫనీ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సందర్శించారు. ఇందులో గ్రామీణ, పేద నేపథ్యాల నుంచి వచ్చిన 170 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్వదేశీ ఆర్కెస్ట్రా. రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు..మ్యూజిక్ మాస్ట్రో, గ్రామీ, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించారు. గ్లోబల్ హ్యుమానిటేరియన్, ఆధ్యాత్మికవేత్త మధుసూదన్ సాయి నేతృత్వంలోని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వివిధ మానవతా కార్యక్రమాలను పర్యవేక్షించారు. …
Read More »ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు BV పట్టాభిరామ్ కన్నుమూత..!
ప్రఖ్యాత హిప్నాటిస్ట్, సైకాలజిస్ట్, వ్యక్తిత్వవికాస నిపుణులు డాక్టర్ పట్టాభి రామ్ (75) కన్నుమూశారు. సోమవారం (జూన్ 30) రాత్రి 9.45 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఇంద్రజాలకుడిగా (మెజీషియన్) తన ప్రయాణాన్ని ప్రారంభించి, కెరీర్‌లో అంచలంచెలుగా ఎదిగారు. ఆయన తన జీవితకాలంలో అనేక బెస్ట్ సెల్లింగ్ మోటివేషనల్ పుస్తకాలను రచించారు. యువతకు లెక్కకుమించి మోటివేషన్ స్పీచ్‌లు ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్ధులు, యువత కోసం ఆయన అహోరాత్రులు కష్టించారు. సానుకూల ఆలోచనలను రేకెత్తించడానికి, ప్రేరేపించడానికి, జీవిత సవాళ్లను అధిగమించి ఉన్నతంగా ఎదగడం.. వంటి ఎన్నో …
Read More »మంత్రి లోకేష్ మంచి మనసు.. చిన్నారి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.15 లక్షల సాయం!
కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. పుట్టకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి వైద్యసాయం అందించి ప్రాణాలు నిలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపూ నాయుడు అనే చిన్నారి పుట్టకతోనే లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని, ఇందుకు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసే చిన్నారి తండ్రి …
Read More »ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?
ఏపీలోని ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించింది. నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు- ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు) 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పీయూసీ-బీటెక్ (రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్) ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధుల నుంచి ఏప్రిల్ 27 నుంచి మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం, ఇతర రాష్ట్రాలకు చెందిన …
Read More »ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. ఆగస్టు 4 నుంచి తరగతులు షురూ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ కౌన్సెలింగ్ జులై 17 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ జరగనుంది. అయితే మొదటి రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యాక మూడో విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అకడమిక్ కేలండర్ ప్రకారం ఇంజనీరింగ్ మొదటి సెమిస్టర్ తరగతులు ఆగస్టు …
Read More »మంచి రోజులొచ్చాయి గురూ.. రికార్డ్ ధర పలికిన కోణసీమ కొబ్బరి!
కొనసీమ రైతుల మంచిరోజులొచ్చాయి. అక్కడ పండేకొబ్బరికాయల ధర ఇప్పుడు రికార్డ్ స్థాయి రేటు పలుకుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జాతీయ మార్కెట్‌లో వెయ్యి కొనసీమ కొబ్బరి కాయల ధర ఏకంగా 23వేల రూపాయలు పలికింది. దీంతో కోనసీమ కొబ్బరి రైతుల్లో ఆనందోత్సహము నెలకొంది.కోనసీమలో పండించే కొబ్బరికాయలకు ప్రస్తుతం జాతీయ మార్కెట్‌లో రికార్డు ధర పలుకుతోంది. చరిత్రలో మునిపెన్నడు చూడని విధంగా కొబ్బరి ధర పెరిగడంతో కోనసీమ రైతుల్లో ఆనందోత్సహము నెలకొంది. పండించిన పంటకు మద్దతు ధర లభిస్తే.. అన్నదాతల కళ్లలో ఆనందంగాని అవదులే …
Read More »సారూ.. జర కనికరించండి.. కలెక్టర్ దగ్గరకు ఎనిమిదేళ్ల బాలుడు!.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
సాధారణంగా ఇంట్లో ఒక సమస్య వస్తే ఓ 8 ఏళ్ల బాలుడు ఏం చేస్తాడు. ఈ వయస్సులో నేను ఏం చేయగలనని గమ్మునుంటాడు. పెద్దలు కూడా పసిపిల్లాడు వాడికేం తెలుసు అనుకుంటారు. కానీ ఇక్కడో బాలులు తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యను ధైర్యంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఏకంగా జిల్లా కలెక్టర్ చేతనే శభాష్ అనిపించుకున్నాడు. తన ధైర్యంతో మూతబడిన తన తల్లి టిఫిన్ సెంటర్‌ను తెరిపించాడు. ఇంతకు ఆ బాలుడు ఎవరో తెలుసుకుందాం పదండి.ఆ రోజు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే.. ఈ సందర్భంగా …
Read More »వర్షాలే వర్షాలు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. దీనికి తోడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడ్డాయి.. అల్పపీడనాలకి అనుబంధంగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నైరుతి, అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జూలైలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలులేని ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో వాతారణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు, …
Read More »పేదోళ్లకు నాణ్యమైన విద్య దక్కాలంటే మీలాంటి వాళ్లు కావాలి సార్ – విజయనగరం జిల్లా కలెక్టర్‌పై ప్రశంసలు
విద్యా హక్కు చట్టం (RTE) అమలులో తప్పులపై విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 25% సీట్లు కేటాయించాల్సిన నిబంధనలు ఉల్లంఘించిన ఆరు కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలలో సౌకర్యాల లేమి, అవకతవకలు గుర్తించడంతో విద్యా రంగంలో కలకలం రేగింది. అధికారుల దర్యాప్తు ఒత్తిడితో పాఠశాలలు వెనుకడుగు వేసి, నిబంధనలు పాటిస్తామని హామీ ఇచ్చాయి.విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్పొరేట్ విద్యాసంస్థలకు గట్టి షాక్ …
Read More »