రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడూల్‌ను ఉన్నత విద్యా మండలి ఈ రోజు విడుదల చేయనుంది. ఆయా ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో సమావేశం నిర్వహించిన తర్వాత ప్రవేశ పరీక్షల తేదీలు, దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్‌లను ప్రకటించనుంది. గతకొంత కాలంగా షెడ్యూల్ విడుదలకు తీవ్ర జాప్యం నెలకొన్న సంగతి తెలిసిందే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడూల్‌ను ఉన్నత విద్యా మండలి గురువారం (ఫిబ్రవరి …
Read More »చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లు! భయంతో వణుకుతున్న జనం..
బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయాని అధికారులు ప్రకటించడంతో ప్రజలు చికెన్ తినడం తగ్గించేశారు. గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెడుతుంటే.. కొన్ని చోట్లా వాటిని చేపలకు మేతగా వేస్తున్నట్లు వీడియోలు బయటికి వస్తున్నాయి. దీంతో జంన మరింత భయపడుతున్నారు.ఇప్పటికే బర్డ్‌ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్న నేపథ్యంలో ప్రజలు చికెన్ తినాలంటేనే వణికిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని రోజులు చికెన్ తినకపోవడం ఉత్తమమని తెలిపింది. దీంతో చికెన్ ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఏపీలోని గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి …
Read More »ఏపీలో బర్డ్ ప్లూ టెర్రర్.. మనిషికి సోకిన వైరస్
ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ టెన్షన్ పుట్టిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అలెర్టయ్యారు. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని.. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్ మాలిని.ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ప్లూ టెర్రర్ కొనసాగుతోంది. ఇప్పటివరకు కోళ్లకు మాత్రమే ఈ ప్లూ సోకగా.. …
Read More »కూటమి నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు: వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
రాష్ట్రంలో స్కామ్‌లు తప్ప ఏమీ జరగడంలేదని ఆరోపించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి… చట్టవిరుద్ధంగా, అన్యాయాలు చేసేవారెవ్వరినీ తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా వస్తుందని.. నేతలంతా ధైర్యంగా ఉండాలన్నారు. కొన్నాళ్లుగా వేర్వేరు జిల్లాల నేతలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో సమావేశమయ్యారు.టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లే వెళ్లే పరిస్థితులు లేవని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని …
Read More »మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే.. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉంది..గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై BNS సెక్షన్ …
Read More »ఒక్క బడి కూడా మూసేయం.. ఇద్దరు పిల్లలున్నా కొనసాగిస్తాం: పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ వరుస నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా ఒడిఒడిగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 117ను ఈ నెలాఖరు నాటికి పూర్తిగా రద్దు చేస్తామని ఇప్పటికే పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు స్పష్టం చేశారు. తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసేయడం జరగదనీ, అన్నీ కొనసాగుతాయని ఆయన …
Read More »భక్తుల మనోభావాలు కాపాడాలన్నదే నా ఆవేదన.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ బుధవారం కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమం సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారని తెలిపారు.తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దోషులను అరెస్ట్ చేయడం సంతోషకరమని.. భవిష్యత్తులో కూడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ఉందంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కేరళలోని …
Read More »పదో తరగతి మార్కులతో తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్షలేదు
తెలుగు రాష్ట్రాల్లోని పదో తరగతి పాసైన వారికి తపాలా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మొత్తం పోస్టుల సంఖ్య, దరఖాస్తు విధానం వంటి ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు..దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి తాజాగా ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీలను …
Read More »ఆ గ్రామాలపై సీఎం స్పెషల్ ఫోకస్.. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు
వివాదాస్పద కొటియా గ్రామాలపై చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏళ్ల తరబడి నానుతూ వస్తున్న సమస్యకు పరిష్కారం దిశగా అడుగులేస్తోంది. అయితే ఏపీ విజ్ఞప్తితో కేంద్రం చొరవ చూపుతుందా? పట్టువిడిచేలా ఒడిశాను ఒప్పిస్తుందా? అసలు గిరిజన గూడేలా గోడేంటి? ఆ వివరాలు ఇలాఆంధ్రా – ఒడిశా సరిహద్దులో కొటియా గ్రామాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మధ్య కొటియా గ్రామాల్లో అభివృద్ధి పనులను ఒడిశా అడ్డుకుంది. ఈ సమస్య మళ్లీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో.. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మ్యాటర్‌ని సీఎం …
Read More »ఏపీ నిరుద్యోగులకు తీపికబురు.. మెగా డీఎస్సీపై కీలక ప్రకటన
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 16,247 టీచర్ పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది. జీఓ 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని పేర్కొంది.నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 16,247 టీచర్ పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది. జీఓ 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని …
Read More »