మోస్ట్ వాంటెడ్ ధార్ గ్యాంగ్‌కు టెక్నో పోలీసింగ్ చెక్ పెట్టింది. అనంతపురంలో సంచలనం రేపిన భారీ చోరీ కేసును చేధించారు పోలీసులు.మధ్యప్రదేశ్‌లో మారుమూల పల్లెలను జల్లెడ పట్టి థార్ దొంగ ముఠాను అరెస్ట్ చేశారు. దాదాపు 2 కోట్ల సొత్తును రికవరీ చేశారు.అనంతపురం శివారు రాజహంస స్వీట్ హోమ్స్‌లోని 3 విల్లాస్ లో జరిగిన శ్రీనగర్ కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును ఛేధించారు పోలీసులు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్స్ మధ్యప్రదేశ్‌కు వెళ్లి మోస్ట్‌వాంటెడ్ ధార్ గ్యాంగ్‌కు …
Read More »2 బల్బులు, టీవీ మాత్రమే ఉన్న గిరిజన గూటికి ఎంత కరెంట్ బిల్లు వచ్చిందో తెల్సా..?
అనకాపల్లి జిల్లా రావికంధం మండలం టి అర్జాపురం పంచాయతీ శివారు గ్రామమైన డోలవానిపాలెంలో ఎస్టీ ఆదివాసి కొండ దొర గిరిజనులు నివసిస్తారు. సత్తిబాబు అనే వ్యక్తి తన ఇంట్లో అవసరాల కోసం రెండు బల్బులు, ఓ టీవీ మాత్రమే ఉన్నాయి. వాటి కోసం విద్యుత్ వినియోగిస్తూ ఉంటారు. అయితే.. విద్యుత్ రీడింగ్ తీసేందుకు వచ్చిన సిబ్బంది బిల్లు తీసి చేతిలో పెట్టారు. ప్రతి నెల మాదిరిగా వందల్లో వస్తుందని అనుకున్నారు.. కానీ అక్షరాల 1,60,000 కరెంట్ బిల్లు వచ్చిందని చెప్పి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. …
Read More »డైరెక్టర్ ఆర్జీవీకి మరో తలనొప్పి.. ఈసారి రంగంలోకి సీఐడీ.. విచారణకు హాజరయ్యేనా…
2019లో రామ్‌గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో ఓ సినిమా తీశారు. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే పేరుతో సినిమాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను యూట్యూబ్‌లో మాత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరిట విడుదల చేశారని గుంటూరు జిల్లాకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్‌కు చెందిన వంశీకృష్ణ బండారు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన వ్యాఖ్యలతో ఎప్పుడు సంచలనం సృష్టించే సినీ దర్శకుడు రామ్ గోపాల్ …
Read More »జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఆరోపణల నేపథ్యంలో… పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు…
జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ ఎపిసోడ్ ఇప్పుడు పార్టీలో చర్చనీయ అంశంగా మారింది. ప్రస్తుతానికి కిరణ్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది. మరోవైపు ఆయన తిరుపతి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ డేటాను తస్కరించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి తిరుపతి అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు జనసేన నేత కిరణ్ రాయల్. వైసీపీ నేతలు ఆడవారిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల …
Read More »తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. నలుగురు అరెస్ట్..?
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ సిట్ నలుగురు నెయ్యి సరఫరాదారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఉన్న వీరిని సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. AR డయిరీ ఏండీ రాజశేఖరన్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన డయిరీ నిర్వాహకులను సిట్ అదుపులోకి ఉన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి కేసులో నలుగురు …
Read More »ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకం.. ప్రతిపక్షహోదా కావాలంటే 10శాతం సీట్లు దక్కాల్సిందే
ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. తాజాగా ఢిల్లీ ప్రజలు కూడా మోదీ నాయకత్వాన్ని బలపరిచారని చెప్పారు. ప్యాలెస్‌ల విషయంలోనూ ఏపీ, ఢిల్లీకి పోలికలు ఉన్నాయని.. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నా.. ఢిల్లీలో శీష్ మహల్ కట్టుకున్నా.. వాటిలోకి అడుగుపెట్టలేకపోయారన్నారు.కొందరు నాయకుల సంక్షేమం ముసుగులో రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు… ఏపీ, ఢిల్లీకి ఈ అంశంలో పలు పోలికలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ విజయం …
Read More »నీట్ యూజీ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష ఎప్పుడంటే?
దేశ వ్యాప్తంగా ఉన్న మెడికాల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్‌ఎంఎస్ వంటి మెడికల్ కోర్సులకు నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. గతేడాది నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్ధులు హాజరైన సంగతి తెలిసిందే..దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్-యూజీ 2025 ప్రవేశ పరీక్ష మే 4న నిర్వహించనున్నట్లు నేషనల్ …
Read More »ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. సాకారం కాబోతున్న ఏళ్ల నాటి కల..
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది.. రాష్ట్ర విభజన టైమ్‌లో ఇచ్చిన హామీని నేరవేర్చుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.. దీంతో ఏళ్ల నాటి కల సాకారం కాబోతోంది. సౌత్ కోస్ట్ రైల్వేజోన్‌కు శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వాల్తేర్ డివిజన్ పేరు విశాఖపట్నం డివిజన్‌గా మార్పు చేసింది.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్ ను ఏర్పాటు …
Read More »ఏపీలో ఇకపై స్మార్ట్‌ఫోన్‌లోనే అన్నీ.. ప్రజలకు ఇది కదా కావాల్సింది
ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే కొద్దిరోజుల్లో అన్ని ప్రభుత్వ సర్టిఫికెట్లు.. 161 సర్వీసులు వాట్సాప్ ద్వారా ప్రజలకు అందనున్నాయి. అందుకు మెటాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే..సమీప భవిష్యత్‌లోనే ఆంధ్రప్రదేశ్ పౌరులకు భౌతిక ధృవీకరణ పత్రాల అవసరం లేకుండా, వారి స్మార్ట్‌ఫోన్ ద్వారానే అన్ని సేవలు పొందే అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని వెల్లడించారు. డేటా …
Read More »వైసీపీ అధినేత జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా పార్టీని వీడుతున్న ముఖ్యనేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో అంతే ధీటుగా పార్టీకి గుడ్ బై చెప్పిన నేతలు రియాక్ట్ అవుతున్నారు. మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డిలు వైఎస్ జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు అనుహ్యంగా మలుపు తిరుగుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రాజ్యసభ ఎంపీ పదవితోపాటు రాజకీయాల నుంచి తప్పుకున్న వైసీపీ సీనియర్ నేత …
Read More »