ఆంధ్రప్రదేశ్

హృదయ విదారకర ఘటన.. పడంటి బిడ్డను చూడకుండానే ప్రాణాలు విడిచిన ఎంపీడీవో!

ఏ తల్లైన పండంటి బిడ్డకు జన్మనిచ్చి మాతృహృదయంతో మురిసిపోతుంది. నవమాసాలు కడుపున కనుపాపను మోసి అమ్మ అనే పిలిపించుకోవాలనుకుంటుంది. అయితే నిండి గర్భిణి అయిన హరిప్రియ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. కాన్పు సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చి, తాను మాత్రం కనులారా చూడకుండానే తుదిశ్వాస విడిచింది.తన ఆయువునే మరో ప్రాణంగా మలిచింది. నవమాసాలు కడుపున కనుపాపను మోసి అమ్మ అనే పిలుపునకు ఆమడ దూరంలో ఆగిపోయింది. ఆ గుండె మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదించకుండానే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినా, తన …

Read More »

మనల్ని ఎవడ్రా ఆపేది.. వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్.. ఎందులో అంటే

2024లో పవన్ కళ్యాణ్ సృష్టించిన సంచలనం అంతా.. ఇంతా కాదు. ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపారు పవన్. ఎన్నికల సమయంలో ఆయన ప్రచారాలు, సభలు, మాటలు అబ్బో.. అప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపించారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించింది ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీబాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్.2024 ముగింపుకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం. కాగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అలాగే …

Read More »

కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్‌.. దేహదారుఢ్య పరీక్షల కాల్‌లెటర్లు వచ్చేశాయ్‌! డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షల అడ్మిట్ కార్డులు గురువారం (డిసెంబర్ 19) విడుదలయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత నియామక ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది. మొత్తం 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తవగా 95,209 మంది అభ్యర్ధులు తదుపరి దశ అయిన దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికయ్యారు. ఇక ఇప్పటికే పోలీసు నియామక మండలి పరీక్షల తేదీలను కూడా ఖరారు చేసింది..ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షకు మార్గం సుగమం అయ్యింది. దేహ దారుఢ్య …

Read More »

ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. ఆ గడువు మరో నెల రోజుల పెంపు

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా దేశంలో ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. అయితే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించి కేంద్రం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.భారతదేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధిక వేతనాలపై పెన్షన్‌లకు సంబంధించిన ఎంపికలు/జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి యజమానులకు తుది పొడిగింపును మంజూరు చేసింది. కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం …

Read More »

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని పాడుబడ్డ ఇంట్లో అసలు గుట్టు బయటపడింది..

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ఓ పార్సెల్ కొరియర్ అయింది.. ఢిల్లీలో ఆ అడ్రస్ తప్పుగా ఉండడంతో అక్కడ పార్సిల్ బాయ్ కి అనుమానం వచ్చింది. ఆ సమాచారాన్ని విశాఖలోని పార్సల్ సంస్థకు అందించి తిరిగి ఆ పార్శిల్ ను వెనక్కి పంపారు. దీనిపై పోలీసులకు సైతం సమాచారం అందించారు.. ఆ తర్వాత ఓ పాడుబడ్డ ఇంట్లో అసలు సీన్ వెలుగు చూడటం సంచలనంగా మారింది.గంజాయి స్మగ్లింగ్ పై నిఘా పెరగడంతో.. స్మగ్లర్లు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు.. ఇటీవల రైల్వే స్టేషన్‌లో అనుమానితులను పట్టుకొని డ్రై …

Read More »

అద్దె గర్భంతో పుట్టిన అరుదైన ఆవు దూడ.. చూసేందుకు ఎగబడుతున్న జనం

ఇటీవల కాలంలో పలు జాతుల ఆవుల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పశు వైద్యాధికారులు ఈ సరోగసి విధానం ద్వారా మేలు జాతి ఆవుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సాహివాల్, గిర్, ఒంగోలు జాతుల వంటి అంతరిస్తున్న ఆవుల ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టిసారించి ఈ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా..అద్దె గర్భంతో పిల్లలు పుట్టడం ఇటీవల మనం తరుచూ చూస్తూనే ఉన్నాం. సెలబ్రెటీలలో అయితే సర్వసాధారణంగా మారింది. అయితే అదే తరహా అద్దె గర్భం ద్వారా …

Read More »

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.

భారతదేశం తీరం వెంబడి అనేక అందమైన బీచ్‌లు ఉన్నాయి. గోవా, కేరళ, అండమాన్ సముద్రతీరంలో వైట్ సాండ్ బీచ్‌లు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. అదే తరహాలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానం లో వైట్‌ సాండ్‌ బీచ్‌ ఉందన్న విషయం ఎంత మందికి తెలుసు? అత్యంత సుందరంగా తెల్లటి ఇసుకతో ఆహ్లాదాన్ని నింపుతుంది. అమలాపురానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం లో సముద్రతీరం బీచ్ ప్రశాంతంగా ఎంతో ఆనందాన్నిస్తుంది . సాయంత్రం వేళ సాగర తీరాన కూర్చొని సేదతీరడం, అందమైన …

Read More »

అడవి పందుల కోసం పెట్టిన ఉచ్చు.. అందులో ఏం చిక్కిందంటే..?

కృష్ణా జిల్లాలో చిరుత పులి మృతి కలకలం రేేపుతుంది. గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మెట్లపల్లి గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత పులి చిక్కి మరణించింది. అయితే ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లి చూడగా పులి ఉచ్చులో చిక్కి మృతి చెంది ఉంది.గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో చిరుతపులి మృతి కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి …

Read More »

కెనడాకు వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు.. అనుమానాస్పద మృతిగా తల్లిదండ్రుల ఆందోళన..!

చదువుకునేందుకు విదేశానికి వెళ్ళిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆకస్మిక మరణం చెందినట్టు ఇంటికి సమాచారం అందగానే కన్నీరు మున్నిరై విలపించారు కుటుంబ సభ్యులు. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకొని.. మృతి పై విచారణ జరిపించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు.విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల ఫణి కుమార్.. ఎంబీఏ పూర్తి చేశాడు. ఎమ్మెస్ చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని.. కెనడాకు వెళ్ళాడు. ఆగస్టు 21న కెనడాలోని కాల్గరి నగరంలో ఉన్న సదరన్ ఆల్బర్ట్ ఆ …

Read More »

రెయిన్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకువస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆతర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది..బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి.. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా …

Read More »