బుసలు కొట్టే పాములతో ఆయన నాట్యం చేయిస్తాడు.. విషపూరిత పాములకు విన్యాసాలు నేర్పిస్తాడు.. అతడే పాముల భాస్కర్‌గా గుర్తింపు పొందిన భాస్కర్‌నాయుడు. ఇప్పటికే పలుమార్లు పాము కాటుకు గురయి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన భాస్కర్‌నాయుడు.. మరోసారి పాముకాటుకు గురయి ఆస్పత్రిపాలయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు టీటీడీ అధికారులు.ప్రమాదకరమైన, విషపూరితమైన పాములను కూడా సులువుగా బంధించడంలో నేర్పరి భాస్కర్ నాయుడు.. స్నేక్ క్యాచర్‌గా వేల సంఖ్యలో పాములను పట్టిన అనుభవం, నైపుణ్యం ఈయన సొంతం. తిరుమలలో కనిపించే పాములను బంధిస్తూ …
Read More »వాయిదాపడిన ఆ డీఎస్సీ పరీక్షలు రేపట్నుంచే..! హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేశారా..?
రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు ఈ నెల 6వ తేదీ నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. అయితే గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు జూన్ 30వ తేదీతో ఆంటే ఈ రోజుతో పరీక్షలు ముగియవల్సి ఉంది. అయితే యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలను కూటమి సర్కార్ వాయిదా వేసింది. ఈ పరీక్షలను జులై 1, 2 తేదీలకు మార్చుతున్నట్లు ఇప్పటికే …
Read More »జాబ్ పోయినా ఉన్నట్టే నటించాడు.. అబద్ధంతో అంతకు మించిన జాబ్ కొట్టాడు.. ఇంతకు అతనెవరో తెలుసా?
ఉన్నపలంగా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తే ఏం చేస్తారు.. మరో ఉద్యోగం వెతుక్కుంటారు. కానీ ఇక్కడో యువకుడు మాత్రం ఉద్యోగం పోయినా ఉన్నట్టు నటించి.. లింక్‌డిన్‌లో ఫేక్ ప్రాజెక్టు పోస్ట్‌లు పెడుతూ పోయిన ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగాన్ని సంపాధించాడు. వివరాళ్లోకి వెళితే.. రెడిట్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక యూజర్ ఒక పోస్ట్ చేశాడు. అందులో తన జీవితంలో ఎదురైన ఓ విచిత్ర సందర్భం గురించి ఇలా వివరించాడు. గత ఆగస్టు నెలలో తనను అనుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించారని.. కనీసం ఎటువంటి …
Read More »ఇక ఏపీ నగరాల దశ తిరిగినట్టే..! కేంద్ర నిధుల ప్రవాహంతో కొత్త శకం ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్‌లో నగరాల అభివృద్ధికి ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిస్తున్న చొరవ, స్పష్టత నగర పాలనకు కొత్త ప్రాణం పోస్తోంది. తాజాగా ఆయన ఉండవల్లి నివాసంలో మంత్రి నారాయణతోపాటు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీసుకున్న కీలక నిర్ణయాలు, మున్సిపాలిటీలపై పెట్టుబడుల పరంపర ఏపీ పట్టణాల భవిష్యత్తును వెలుగులోకి తీసుకువస్తున్నాయి. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కలిగి, డబుల్ ఇంజిన్ సర్కార్‌గా ఉండడం …
Read More »అదే మా టార్గెట్.. అప్పట్లోపు పోలవరం పూర్తి చేసి తీరుతాం- సీఎం చంద్రబాబు
ఏపీ రైతులకు సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సపోర్ట్ ఉందని.. ఖచ్చితంగా ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2027 లోగానే ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం …
Read More »ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!
తెలుగు రాష్ట్రాల నుంచి కన్యాకుమారి వెళ్లాలనుకనే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను కేటాయించింది.ఇప్పటికే ఉన్న ట్రైన్‌లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు జులై 2 నుంచి 25వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వెళ్లే (హైదరాబాద్-కన్యాకుమారి- 07230) ట్రైన్ ప్రతి బుధవారం సాయంత్రం 5.20 గంటలకు నాంపల్లి స్టేషన్ …
Read More »ఒకేసారి రెండు అల్పపీడనాలు.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి.. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకట చేసింది.. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం వ్యవస్థల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40 కి.మీ.వేగంతో ఈదురు గాలులతో.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. …
Read More »టెక్నలాజియా..! వాటర్ టిన్‌లతో గోదావరిలో చేపల వేట.. చూస్తే అదుర్స్ అంటారంతే..
చేపలు పట్టడంలో నూతన టెక్నాలజీ వాడుతున్నారు గోదారోళ్ళు.. వలలు, గేలాలు వేసి చేపలు పట్టడం పాత పద్ధతి.. ప్లాస్టిక్ డబ్బాలతో చేపలు పట్టడం నూతన పద్ధతి.. అంటూ గోదావరిలో పెద్ద పెద్ద చేపలు పడుతూ గోదావరి ప్రాంత వాసులు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. సామాన్యంగా మత్స్యకారులు సముద్రాలు, నదులు, కాలువలు, చేపలు వేటాడాలంటే పడవల్లో వెళ్ళి వలలు వేసి చేపలు పడుతుంటారు. లేదంటే ఒడ్డున ఉండి గేలాలు వేసి పడుతుంటారు.. ఇవన్నీ సర్వసాధారణం.. కానీ గోదారోళ్ళు చేపలు పట్టడంలో నూతన ట్రెండ్ అవలంభిస్తున్నారు. చేపలు …
Read More »కేరళ కొత్త డీజీపీగా ఏపీ వాసి.. ఛార్జ్ తీసుకోనున్న రవడ చంద్రశేఖర్
కేరళ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి రవడ చంద్రశేఖర్‌ను నియమించింది. కేరళలో తలస్సేరి ASPగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన 15 సంవత్సరాలుగా IB డిప్యుటేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర డిప్యుటేషన్ నుండి వచ్చి కేరళ DGPగా నియమితులయ్యారు. డీజీపీ పోస్ట్ కోసం ఈయనతో పాటు మరో ఇద్దరు రేసులో ఉండగా కేబినెట్ చంద్రశేఖర్‌వైపే మొగ్గు చూపింది.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రవడ చంద్రశేఖర్, కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్ (డీజీపీ)గా …
Read More »మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కీలక అప్డేట్ వచ్చేసిందోచ్..
ఎన్నికల్లో హమీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు కొత్త బస్సులు కొనడం గానీ, అవసరమైతే అద్దెకు తీసుకోవడం గానీ చేయాలని సీఎం సూచించారు. …
Read More »