ఆంధ్రప్రదేశ్

టెక్నలాజియా..! వాటర్ టిన్‌లతో గోదావరిలో చేపల వేట.. చూస్తే అదుర్స్ అంటారంతే..

చేపలు పట్టడంలో నూతన టెక్నాలజీ వాడుతున్నారు గోదారోళ్ళు.. వలలు, గేలాలు వేసి చేపలు పట్టడం పాత పద్ధతి.. ప్లాస్టిక్ డబ్బాలతో చేపలు పట్టడం నూతన పద్ధతి.. అంటూ గోదావరిలో పెద్ద పెద్ద చేపలు పడుతూ గోదావరి ప్రాంత వాసులు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. సామాన్యంగా మత్స్యకారులు సముద్రాలు, నదులు, కాలువలు, చేపలు వేటాడాలంటే పడవల్లో వెళ్ళి వలలు వేసి చేపలు పడుతుంటారు. లేదంటే ఒడ్డున ఉండి గేలాలు వేసి పడుతుంటారు.. ఇవన్నీ సర్వసాధారణం.. కానీ గోదారోళ్ళు చేపలు పట్టడంలో నూతన ట్రెండ్ అవలంభిస్తున్నారు. చేపలు …

Read More »

కేరళ కొత్త డీజీపీగా ఏపీ వాసి.. ఛార్జ్‌ తీసుకోనున్న రవడ చంద్రశేఖర్

కేరళ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా ఏపీకి చెందిన ఐపీఎస్‌ అధికారి రవడ చంద్రశేఖర్‌ను నియమించింది. కేరళలో తలస్సేరి ASPగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన 15 సంవత్సరాలుగా IB డిప్యుటేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర డిప్యుటేషన్ నుండి వచ్చి కేరళ DGPగా నియమితులయ్యారు. డీజీపీ పోస్ట్‌ కోసం ఈయనతో పాటు మరో ఇద్దరు రేసులో ఉండగా కేబినెట్‌ చంద్రశేఖర్‌వైపే మొగ్గు చూపింది.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రవడ చంద్రశేఖర్, కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్ (డీజీపీ)గా …

Read More »

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కీలక అప్డేట్ వచ్చేసిందోచ్..

ఎన్నికల్లో హమీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు కొత్త బస్సులు కొనడం గానీ, అవసరమైతే అద్దెకు తీసుకోవడం గానీ చేయాలని సీఎం సూచించారు. …

Read More »

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. అందుబాటులోకి క్యారవ్యాన్‌ సర్వీస్‌!

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెడతామని, గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని మురళీ ఫార్చూన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన టూరిజం కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన టూరిజం క్యారవాన్‌ను ప్రారంభించారు.ఆంద్రప్రదేశ్ లో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. విజయవాడలో జరిగిన టూరిజం కాంక్లేవ్‌లో నూతన క్యారవ్యాన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెడతామని, గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. …

Read More »

కోరిన కోర్కెలు తీర్చే అరసవెల్లి సూర్య దేవాలయం.. చరిత్ర తెలుసా.?

ప్రాచీనమైన ఆలయాల్లో అరసవెల్లి సూర్యభగవానుడి ఆలయ౦ ఒకటి. ఈ ఆలయం ఆంధ్ర‌ప్రదేశ్‌‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శ్రీకాకుళం కేంద్రానికి 1.6 కి.మీ దూరంలో ఉంది. ప్రతిఏటా రథ సప్తమికి వేలాదిగా భక్తులు ఇక్కడ సూర్యభగవానుడి దర్శనకి తరలివస్తారు. ఇప్పుడు ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడి ఏడాదికి రె౦డు సార్లు సూర్యకిరణాలు గుడిలోని మూలవిరాట్‎ను తాకుతాయి. ఇది ఈ ఆలయ నిర్మాణ గొప్పతన౦. శాసనాలు ప్రకారం 7వ శతాబ్ద౦లో  ఈ ఆలయన్ని నిర్మించారు. మన దేశ౦లో ఉన్న అతికొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి.  ఇక్కడి మూలవిరాట్‎ను స్వయ౦గా దేవే౦ద్రుడు ప్రతిష్టించారని చెబుతారు. అయితే ‘పద్మపురాణ౦’ …

Read More »

అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. తెలుగు రాష్ట్రాలను మబ్బులు కమ్మేశాయి. నైరుతికి అల్పపీడనం తోడై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని.. దీంతో మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతోపాటు గంటకు 30-40 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందంటే.. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడుతోందని.. …

Read More »

రైతులకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్.. ఆ రోజే ఖాతాల్లోకి డబ్బులు!

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో మరో హామీని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండు మూడు రోజుల్లో అన్నదాత సుఖీభవ హామీకి సంబంధించిన నిధులను రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇటీవలే ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం.. పాలనలో తమదైన రీతిలో ముందుకెళ్తోంది. ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపిస్తూ.. మరో వైపు ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా …

Read More »

గుడివాడ వచ్చిన కొడాలి నాని – ఛాతికి ఆ బెల్డ్ ఎందుకు ధరించారో తెల్సా..?

టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు చెందిన దుకాణంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ఊరట లభించింది. ఆయనకు గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఛాతీకి బెల్టుతో కోర్టుకు వచ్చిన నాని.. బెయిల్ పత్రాలు సమర్పించారు. కొడాలి నానికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది గుడివాడ కోర్టు. మాజీ MLA రావి వస్త్ర దుకాణంపై దాడి కేసులో షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది కోర్టు. మంగళవారం, శనివారం గుడివాడ పీఎస్‌లో సంతకం చేయాలని షరతు విధించింది. …

Read More »

రూ.కోటికి.. రెండు కోట్లు ఇస్తామని బంపర్ ఆఫర్.. కట్‌చేస్తే..దిమ్మతిరిగే ట్విస్ట్!

రద్దయిన రూ.2వేల నోట్లతో రెట్టింపు డబ్బును ఆశగా చూపి ఓ ముఠా మోసానికి పాల్పడింది. ఓ వ్యాపారి నుంచి రూ.కోటి కాజేసి అడ్డంగా దొరికి పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.73.20 లక్షల నగదు తోపాటు రెండు వాహనాల స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసిందిచలామణిలో లేని రూ.2వేల నోట్లతో రెట్టింపు ఆదాయం పొందవచ్చని ఆశచూపుతూ ఓ ముఠా మోసాలకు పాల్పడుతున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి …

Read More »

 డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాం.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం- సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో గంజాయి మాట వినిపిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో డ్రగ్స్‌, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నామని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ ముందుకెళతామని ఆయన హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణను గత ప్రభత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని ఎవరైనా డ్రగ్స్‌తో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గురువారం గుంటూరులో నిర్వహించిన వాకథాన్‌ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో …

Read More »