ఎడ్యుకేషన్

తెలంగాణ పాఠశాల విద్యలో డిజిటల్ విప్లవం.. త్వరలో ఏఐ సేవలు షురూ!

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య, ఉపాధ్యాయ శిక్షణను మెరుగుపరచడానికి డిజిటల్ కార్యక్రమాలు, కృత్రిమ మేధస్సును ఉపయోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందు కోసం విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా నేతృత్వంలోని బృందం, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ EV నరసింహా రెడ్డి గురువారం బెంగళూరులో EkStep ఫౌండేషన్‌ను సందర్శించారు..తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డిజిటల్ పద్ధతులను విస్తృతంగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో, పాఠశాల …

Read More »

ఇకపై ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్ధులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ సర్కార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ఠ వయోపరిమితిలోనూ ఐదేళ్ల పాటు మినహాయింపు ఇస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ఈ చర్యలు చేపట్టింది. దివ్యాంగులను మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించి, ఒక్కో కేటగిరీ వైకల్యానికి ఒక్కో శాతం చొప్పున రిజర్వేషన్‌ అమలు చేయనుంది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా …

Read More »

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. ఎప్పట్నుంచంటే?

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2024 పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ పరీక్షలు ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. పరీక్షకు మూడు రోజుల ముందు నుంచి అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి తీసుకువస్తారు. సైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రతీయేట ఈ పరీక్షను …

Read More »

తెలంగాణ ఇంటర్ బోర్డ్ vs ప్రైవేటు జూనియర్ కాలేజీలు.. యవ్వారం ఎక్కడిదాకా వెళ్తుందో?

ఇంటర్ బోర్డు వైఖరిపై తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీలు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలకు తమ కాలేజీలను సెంటర్లుగా ఇవ్వబోమని తెగేసి చెబుతున్నాయి. దీంతో మరో నెల రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానుండగా.. పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1125 కాలేజీలు బోర్డు నిబంధనలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టాయి.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు సెంటర్లపై సందిగ్ధత ఏర్పడింది. ఇంటర్ బోర్డు వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రైవేటు జూనియర్ …

Read More »

ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు యూపీఎస్‌సీ మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు.. పరీక్ష ఎప్పుడంటే?

నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని పేదింటి విద్యార్ధులకు ప్రతీయేట స్కాలర్ షిప్ లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది తొలిసారిగా యూపీఎస్‌సీ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షను నిర్వహించేందుకు ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కింది ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మొదటిసారిగా యూపీఎస్‌సీ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎక్సెల్‌ సివిల్స్‌ అకాడమీ డైరెక్టర్‌ రాజేంద్రకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. యూపీఎస్‌సీ …

Read More »

ఇంటర్‌ ఫస్టియర్‌ పబ్లిక్‌ పరీక్షల రద్దుపై ఇంటర్‌ బోర్డు యూటర్న్‌.. ఇక రద్దు లేనట్లే!

ఇంటర్మీడియట్‌ విద్యామండలి కొత్తగా ప్రతిపాదించిన సంస్కరణలపై విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో పబ్లిక్‌ పరీక్షలు రద్దు చేస్తే వచ్చే ప్రతికూలతల గురించి విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు పరీక్షలపై శ్రద్ధ తగ్గుతుందని, చదువుపై దృష్టిపెట్టరని జనవరి 26 స్వీకరించిన సలహాలు, సూచనల్లో వారు పేర్కొన్నారు..రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు రద్దు చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానం …

Read More »

ఇంటర్ బోర్డు పైత్యం.. పరీక్షలకు ముందు ఇంటర్‌ ప్రశ్నపత్రంలో మార్పులేంది సామీ..?

ఒకవైపు పరీక్షలు సమీపిస్తుంటే విద్యార్ధుల్లో ఒత్తిడి నానాటికీ పెరిగిపోతుంది. రాత్రింబగళ్లు కష్టపడి చదువుతున్నారు. ఇలాంటి క్లిష్టసమయంలో ఇంటర్ బోర్డు వింత ప్రకటన జారీ చేసింది. ఉన్నట్లుండి ఇంటర్ లో ఇంగ్లిష్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అటు ఉపాధ్యాయులతోపాటు ఇటు విద్యార్ధులు అంతా గందరగోళంలో పడిపోయారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 15 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యార్ధులు ముమ్మరంగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యా సంవత్సరం దాదాపు ముగింపుకు వచ్చిన …

Read More »

త్వరలో గురుకుల విద్యాలయాల్లో డిగ్రీ కోర్సులు ప్రారంభం.. సంక్షేమ శాఖ మంత్రి స్వామి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏకలవ్యా.. గురుకుల విద్యాలయాల్లో త్వరలో డిగ్రీ కోర్సులు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయా గురుకులాల్లో ఐదు నుంచి పదో తరగతి వరకు, ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు డిగ్రీ కోర్సులు కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో ప్రస్తుతం 5 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు బాల బాలికలకు ప్రభుత్వం విద్యను అందిస్తుంది. …

Read More »

మీరు మీ తల్లిదండ్రులకు ఏకైక కూతురా? అయితే ఈ స్కాలర్‌షిప్‌ మీకోసమే

పదో తరగతి పూర్తి చేసిన బాలికలకు సీబీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా కలిగిన బాలికా విద్యార్ధినులకు ప్రతియేటా మాదిరిగానే ఈ సారి కూడా సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ మెరిట్ స్కాలర్‌షిప్‌ అందించేందుకు ముందుకొచ్చింది. పదో తరగతి పాసై 11వ లేదా 12వ తరగతిలో ప్రవేశాలు పొందిన విద్యార్ధినులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు..తల్లిదండ్రులకు ఒకే ఒక సంతానంగా కలిగి ప్రతిభ కలిగిన బాలికలకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) బోర్డు యేటా సింగిల్‌ గర్ల్‌ …

Read More »

డీపీఆర్‌ఓ అభ్యర్థులకు అలర్ట్‌.. ధ్రువపత్రాల పరిశీలన తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).. డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (డీపీఆర్‌ఓ) పోస్టులకు సంబంధించి కీలక అప్ డేట్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఇప్పటికే రాత పరీక్ష పూర్తి కాగా మెరిట్ లిస్ట్ కూడా వెల్లడించింది. ఈ పోస్టలకు ఎంపికైన అభ్యర్ధులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించే తేదీని ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (డీపీఆర్‌ఓ) పోస్టులకు సంబంధించి ఇప్పటికే రాత పరీక్ష పూర్తైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ విడుదల చేయగా… …

Read More »