తెలంగాణ రాష్ట్ర పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఫలితాల కోసం విధ్యార్ధులు కళ్లు కాయలుకాసేలా విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడించగా.. తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు మాత్రమే వెల్లడయ్యాయి. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదలకానున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ …
Read More »మెగా డీఎస్సీ అభ్యర్ధులకు షాకింగ్ న్యూస్.. పరీక్షల కేంద్రాలు మారాయ్! కొత్త హాల్ టికెట్లు జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ 2025 ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి రోజుకు రెండు సెషన్ల చొప్పున జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పరీక్షలు కూడా పూర్తయ్యాయి. అయితే డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పు చేస్తున్నట్లు తాజాగా రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి సర్కార్ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పలు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసింది. దీంతో జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించవల్సిన అన్ని …
Read More »ఏపీ, తెలంగాణ సహా 7 రాష్ట్రాల్లో అత్యధికంగా టెన్త్, ఇంటర్ ఫెయిల్ విద్యార్ధులు.. కేంద్రం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా అస్సాం, కేరళ, మణిపుర్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 7 రాష్ట్రాల్లో గత ఏడాది ఫెయిలైన విద్యార్థులు 66 శాతంగా ఉన్నారని కేంద్రం తెలిపింది. 10, 12 తరగతులకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ సిఫార్సు చేశారు..పరీక్షల్లో విద్యార్థుల ఫెయిల్ శాతం అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతులకు కామన్ బోర్డును ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర విద్యా శాఖ సూచించింది. …
Read More »విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 3 రోజులు పాఠశాలలకు సెలవులు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వేసవి సెలవులు ముగిసి ఈనెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు విద్యార్థులకు ఏకంగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులకు పండగే.. పండగ. మరి ఈ సెలవులు ఎందుకు వస్తున్నాయి? అన్ని పాఠశాలలకు వర్తిస్తాయా? లేదా అనేది తెలుసుకుందాం.. పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులు ఎగిరి గంతులేస్తారు. గత వారం కిందటనే ప్రారంభమైన పాఠశాలలు ఇప్పుడు మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర …
Read More »ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!
తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు ఈ ఏడాది సర్కారు నిరాకరించింది. ఇష్టారీతిన ఫీజుల పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త ఫీజుల అధ్యయనానికి కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఫీజుల అంశంపై భేటీ అయిన టీఏఎఫ్ఆర్సీ – తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఈ యేడాది పాత ఫీజులతోనే ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జులై మొదటి వారంలో ఎప్ సెట్ కౌన్సిలింగ్ జరగనుంది. …
Read More »ఐబీపీఎస్ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్… ఏ పరీక్ష ఎప్పుడంటే?
2025-26 సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రివైజ్‌డ్ జాబ్స్ క్యాలండర్ విడుదలైంది. ఇందులో ఆర్‌ఆర్‌బీ, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, సీఎస్‌ఏ, మేనేజ్‌మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్ ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం..ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. 2025-26 సంవత్సరానికి సంబంధించి రివైజ్‌డ్ జాబ్స్ క్యాలండర్ విడుదలైంది. ఇందులో ఆర్‌ఆర్‌బీ, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, సీఎస్‌ఏ, మేనేజ్‌మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్ ప్రకటించింది. బ్యాంకింగ్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న …
Read More »‘మోడల్ విద్యకు నిర్మాణాత్మక సంస్కరణలు తెస్తున్నాం..’ కేంద్రమంత్రితో లోకేశ్ భేటీ
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక సంస్కరణలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించారు. లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందులో భాగంగా ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (ఎల్‌ఈఏపీ) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాప్రమాణాల మెరుగుదలకు …
Read More »ఇంటర్ సప్లిమెంటరీ మార్కుల మెమోలు వచ్చేశాయ్.. డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 16న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 50.82 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,13,880 మంది విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్ ఇయర్‌లో 2,49,358 మంది పరీక్షలు రాస్తే.. అందులో 1,68,079 మంది అంటే 67.4 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,47,518 మంది పరీక్షలు రాయగా.. ఇందులో 76,260 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీకి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 17 నుంచి జూన్ 23వ …
Read More »తెలంగాణ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు.. జులై 14 నుంచి తరగతులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నవంబరులో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు మంజూరైన సంగతి తెలిసిందే. కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్‌నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు జవహర్ నవోదయ విద్యాలయా (జేఎన్‌వీ)లు మంజూరయ్యాయి. ఈ 7 నవోదయ విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచే ఆరో తరగతి ప్రవేశాలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 పాత విద్యాలయాలుండగా వాటిలో ప్రవేశాలు ముగిశాయి. కొత్త వాటిల్లో ఆరో తరగతి ప్రవేశాలు …
Read More »ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే.. 1:2 నిష్పత్తిలో ఎంపిక!
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 పోస్టులకు తుది గట్టానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తికాగా.. తాజాగా ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో 1:2 నిష్పత్తిలో ఇంటర్య్వూకి అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఈ ప్రకారంగా మొత్తం 182 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. వీరందరికీ జూన్ 23 నుంచి జులై 15వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత ఇంటర్వ్యూ తేదీలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఏపీపీఎస్సీ …
Read More »