ఆట ఏదైనా.. భారత్-పాకిస్థాన్ జట్లు ఎప్పటికీ దాయాదులే. కానీ మీరెప్పుడైనా అనుకున్నారా.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు గెలవాలని భారత అభిమానులు కోరుకోవాల్సి వస్తుందని. కానీ వచ్చింది.. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో తన చివరి లీగ్ దశ మ్యాచులో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఇప్పటికీ సెమీ ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంది. అదేలా అంటే.. ఈ గ్రూప్‌లో చివరి మ్యాచ్ …
Read More »సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. హైదరాబాద్‌లో సిక్సర్ల వర్షం
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిసింది. భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. సంజూ శాంసన్ మెరుపు సెంచరీ చేశాడు. అతడికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తోడవ్వడంతో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. బంతి వేయడం గాల్లోకి చూడటం బంగ్లా ఆటగాళ్ల వంతైంది. ఆకాశమే హద్దుగా చెలరేగిన సంజూ శాంసన్ కేవలం 47 బంతుల్లో 111 పరుగులు (సిక్స్‌లు 8, ఫోర్లు 11) చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 75 పరుగులు (సిక్స్‌లు 5, …
Read More »ఆధునిక హంగులతో కొత్త ఎన్‌సీఏ.. బెంగళూరులో ప్రారంభించిన బీసీసీఐ
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ.. బెంగళూరులో తమ కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీని ప్రారంభించింది. అయితే ఈ కొత్త ఎన్‌సీఏకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (బీసీఈ)గా పేరుపెట్టారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జైషా పలువురు ఇతర ఆటగాళ్లతో కలిసి ఈ సెంటర్‌ను ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. వాస్తవానికి ఇప్పటివరకు జాతీయ క్రికెట్ అకాడమీని.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో నిర్వహించేవారు. కానీ తాజాగా కెంపెగౌడ విమానాశ్రయానికి …
Read More »అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనీ.. మహీ కోసం IPL రూల్స్‌నే మార్చేశారుగా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరే ఆటగాడికి దక్కని క్రేజ్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంతం. ఈ విషయం అందరికీ తెలిసిందే. పదకొండుసార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది కెప్టెన్ కూల్ మాత్రమే. అందుకే అటువంటి ఆడగాడిని ఏ జట్టు అయినా ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐపీఎల్ పాలకమండలి.. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా …
Read More »క్లీన్‌స్వీపే లక్ష్యంగా కాన్పూర్‌లో అడుగుపెట్టిన భారత్.. జర్నీ వీడియో షేర్ చేసిన బీసీసీఐ
బంగ్లాదేశ్‌తో చివరిదైన రెండో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు కాన్పూర్ చేరుకుంది. ఇప్పటికే తొలి మ్యాచులో 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాన్పూర్ వేదికగా జరిగే ఈ టెస్టులోనూ గెలిచి.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. ఇక ఎయిర్‌పోర్ట్‌కు చేరిన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పటిష్ట భద్రత మధ్య వారిని.. పోలీసులు టీమిండియా బస చేసే హోటల్‌కు తీసుకెళ్లారు. బంగ్లాదేశ్ జట్టు కూడా …
Read More »దక్షిణాఫ్రికాకు అఫ్ఘానిస్థాన్ షాక్.. తొలిసారి వన్డే సిరీస్ కైవసం
ప్రపంచ క్రికెట్‌లో అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్లు అనామక జట్టుగా ఉన్న అఫ్ఘాన్.. ఇటీవల కాలంలో హేమాహేమీ జట్లను సైతం ఓడిస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా జట్టును వరుసగా రెండు మ్యాచుల్లో ఓడించి.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఆ దేశ అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. దక్షిణాఫ్రికా జట్టును మాత్రం షాక్‌కు గురి చేసింది. తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన అప్ఘానిస్థాన్.. రెండో వన్డేలో ఏకంగా 177 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే …
Read More »ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఫిక్స్..! ఫ్రాంఛైజీల రిటెన్షన్ డెడ్‌లైన్ అదే.. రూల్స్‌పై ఉత్కంఠ!
భారత్ సహా ప్రపంచ నలుమూలల నుంచి కూడా క్రికెట్ అభిమానులకు.. ఐపీఎల్‌పై అత్యంత ఆసక్తి ఉంటుంది. దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘంగా సాగే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఇటు బీసీసీఐకి.. అటు ఆటగాళ్లపై కాసులు కురిపిస్తుందని చెప్పొచ్చు. రాత్రికి రాత్రే ఆటగాళ్ల దశ మార్చగల సత్తా ఐపీఎల్‌కు ఉంది. ఫ్రాంఛైజీలు ఆయా ఆటగాళ్లను దక్కించుకునేందుకు నిర్వహించే వేలం ఇంకా ఉత్కంఠకరంగా సాగుతుంది. గత సీజన్‌కు ముందు నిర్వహించిన మినీ వేలంలోనే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ అత్యధికంగా వరుసగా …
Read More »సొంతగడ్డపై పాకిస్థాన్‌కు ఘోర పరాభవం.. రెండో టెస్టులోనూ బంగ్లాదేశ్ విజయం..
సొంతగడ్డపై పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఆ జట్టు టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. పూర్తిస్థాయి జట్టులో బరిలోకి దిగినప్పటికీ.. బంగ్లాదేశ్‌ను కట్టడి చేయలేక చిత్తుగా ఓడిపోయింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓడి.. ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. రెండో టెస్టులో పట్టు చిక్కే అవకాశం లభించినప్పటికీ.. 6 వికెట్ల తేడాతో పరాజయం పాలై పరువు పోగొట్టుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో 185 …
Read More »పాకిస్థాన్‌కు టీమిండియా రావొద్దు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆతిథ్య పాకిస్థాన్ ఏర్పాట్లు చకచకా చేస్తోంది. యుద్ధ ప్రాతిపదికన స్టేడియాల్లో మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించింది. అయితే భారత్ మాత్రం పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనే విషయంపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. కొందరేమో.. ఇరు దేశాల మధ్య ఘర్షణలను పక్కకు పెట్టి ఆటకోసమైనా భారత్.. పాక్‌కు వెళ్లాల్సిందే అని పట్టుబడుతున్నారు. పలువురు పాకిస్థాన్ మాజీలు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ల కోసం పాకిస్థాన్ అభిమానులు ఎదురుచూస్తున్నారని.. చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ …
Read More »పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌లో లుకలుకలు.. కోర్టుకెక్కిన రచ్చ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ లీగ్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాటిని సొంతం చేసుకునేందుకు ఎంతో మంది దిగ్గజ వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటారు. ఇటీవల బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిన నేపథ్యంలో ఫ్రాంఛైజీల కోసం పోటీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి లీగ్‌లో భాగమైన పంజాబ్ కింగ్స్ ప్రాంఛైజీలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ జట్టు యజమానుల మధ్య వాటాల విక్రయం విషయంలో వివాదం మొదలైనట్లు సమాచారం. పంజాబ్ …
Read More »