టెక్నాలజీ

ఢిల్లీలో బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఇద్దరి మధ్య కుదిరిన పలు కీలక ఒప్పందాలు..!

దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బిల్‌గేట్స్‌తో చంద్రబాబు చర్చించారు. 40 నిమిషాల పాటు వీళ్లిద్దరి మధ్య భేటీ జరిగింది. ఈ భేటీలో పలు ఒప్పందాలు కూడా జరిగినట్లు సమాచారం. ప్రముఖ వ్యాపార దిగ్గజం, బిలియనీర్ బిల్‌గేట్స్‌తో కలిసిన విషయాన్ని ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్ట్ చేశారు. బిల్ గేట్స్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ …

Read More »

AI-సర్టిఫైడ్ ప్రొఫెషనల్, యువ మేధావి సిద్ధార్థ్ నంద్యాలను అభినందించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన AI-సర్టిఫైడ్ ప్రొఫెషనల్, భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల కలుసుకున్నారు. కేవలం ఏడు సెకన్లలో గుండె జబ్బులను గుర్తించగల కృత్రిమ మేధస్సు ఆధారిత అప్లికేషన్ ‘సిర్కాడియావి’ని సిద్ధార్థ్ అభివృద్ధి చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన సిద్ధార్థ్ కుటుంబం అమెరికాలో స్థిరపడింది. 14 ఏళ్ల సిద్ధార్థ్ ఒరాకిల్, ARM లచేత గుర్తింపు పొందిన AI నిపుణుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హృదయ సంబంధ వ్యాధులను ముందస్తుగా గుర్తించడంలో విప్లవాత్మకంగా …

Read More »

డేంజర్ బెల్.. ప్రమాదకర స్థాయికి యూవీ ఇండెక్స్.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..

భానుడి భగభగలు చూసి మే నెల వచ్చిందా అని చూస్తే… క్యాలెండర్‌ ఇంకా మార్చి కూడా దాటలేదు. అప్పుడే భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు. బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాడు. ఇప్పుడే ఏమైంది.. UV రేస్‌తో ముందుంది మరింత మంట అంటున్నాడు. అసలీ UV కిరణాల కథేంటి..? తెలుగు రాష్ట్రాలపై వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది…?వేసవి కాలం హడలెత్తిస్తోంది.. ఈసారి ఫిబ్రవరి నుంచే ఫుల్‌ ఫైర్ మీదున్నాడు భానుడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే దంచికొడుతున్నాడు. సాయంత్రమైనా భూమి సెగలు.. పొగలు కక్కుతుందంటే …

Read More »

PMO, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. ప్రస్తుతం, విక్రమాదిత్య పరిశోధన కేంద్రంలో ఒక వేద గడియారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యాప్ కూడా లాంచ్ కానుంది. ప్రారంభంలో, ఈ గడియారాన్ని ప్రధానమంత్రి కార్యాలయం, కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేస్తారు.గత సంవత్సరం ఫిబ్రవరి 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విక్రమాదిత్య వేద గడియారాన్ని ప్రారంభించారు. విక్రమాదిత్య వేద గడియారం ప్రపంచంలోనే మొట్టమొదటి గడియారం. ఇది భారతీయ సమయ …

Read More »

తీగలాగితే డొంక కదులుతోంది.. ఇకపై ఆటలు సాగవంటున్న సైబర్ పోలీసులు!

సైబర్ క్రైమ్.. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఈ మోసాలకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు..తెలంగాణ పోలీసులు. దీంతో కలుగులో దాక్కున్న సైబర్‌ కేటుగాళ్లు..పట్టుబడుతున్నారు.సైబర్‌ కేటుగాళ్లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు.. తెలంగాణ పోలీసులు. ఆన్‌లైన్‌ ఫ్రాడ్స్‌పై ఓవైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే..మరోవైపు నేరాలకు పాల్పడుతున్నవారిని ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిన పోలీసులు..గత రెండు నెలల వ్యవధిలో 161 మంది సైబర్ నేరగాళ్లను …

Read More »

నేటితో ముగియనున్న కుల గణన సర్వే! ఇంకా వివరాలు ఇవ్వని వాళ్లు ఏం చేయాలంటే..

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే గడువు నేటితో ముగుస్తుంది. ఇంకా పాల్గొనని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్ పోర్టల్, ఎంపీడీవో కార్యాలయాలు ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు.గతంలో జరిగిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16 నుండి 28 వరకు ఇంతకు ముందు సర్వేలో పాల్గొనని వారి కోసం కుల గణన సర్వే …

Read More »

ప్రధాని నోట ఆదివాసీ మాట.. దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న ఆదిలాబాద్ పేరు..!

భారతదేశంలో AI ప్రాధాన్యత పెరుగుతుందని.. మారుమూల గిరిజన గ్రామాల్లోను ఏఐని వినియోగిస్తున్నారని.. అందుకు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఉపాధ్యాయుడు తొడసం కైలాసే నిదర్శనమని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తొడసం కైలాస్.. అడవుల జిల్లా ఆదిలాబాద్, మావల మండలం వాఘాపూర్, గ్రామానికి చెందిన గోండి (భాష) రచయిత.ఆదిలాబాద్ జిల్లా పేరు మరోసారి దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఓ ఆదివాసీ ఉపాధ్యాయుడి చేసిన కృషిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంతో ఆదిలాబాద్ జిల్లా ఆనందంలో మునిగితేలుతోంది. తమ భాష యాసను బ్రతికించుకునేందుకు ఆదివాసీ ఉపాధ్యాయుడు …

Read More »

ఆన్‌లైన్‌లో తత్కాల్ రైల్వే టిక్కెట్లు త్వరగా బుక్‌ కావాలంటే సులభమైన ట్రిక్స్‌

టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు యాప్‌ను కనీసం రెండుసార్లు తెరిచి, మీ గమ్యస్థానాన్ని సెర్చ్‌ చేయండి. తద్వారా మీరు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి యాప్‌ను తెరిచిన వెంటనే మీరు వెతుకుతున్న ప్రదేశాలు కనిపిస్తాయి. ‘తత్కాల్’ ఎంపికను ఎంచుకుని గమ్యస్థానాన్ని ఎంచుకోవడానికి ‘సెర్చ్‌’ బటన్‌పై క్లిక్ చేయండి.. తత్కాల్ టిక్కెట్లు అనేవి అత్యవసర లేదా చివరి నిమిషంలో ప్రయాణాలకు తక్కువ సమయంలో బుక్ చేసుకోగల రైలు టిక్కెట్లు. అయితే, అధిక డిమాండ్ కారణంగా IRCTC రైల్ కనెక్ట్ యాప్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ …

Read More »

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక యూపీఐ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా!

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వినియోగదారులు డిజిటల్ వాలెట్ నుండి డబ్బును సులభంగా బదిలీ చేయగలరు. దీని ప్రాసెసింగ్‌లో తక్కువ సమయం పడుతుంది. చందాదారులకు మెరుగైన సౌకర్యం లభిస్తుంది. దీని వలన బ్యాంకింగ్ వివరాలు, ధృవీకరణకు సంబంధించిన ఇబ్బంది కూడా తప్పుతుంది.. దేశంలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న లక్షలాది మందికి శుభవార్త వచ్చింది. EPFO ​చందాదారులు ఇకపై తమ PF ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. వారు UPI ద్వారా PF డబ్బును ఉపసంహరించుకోవచ్చు. …

Read More »

రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతో పాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ-సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు.రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతో పాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ-సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. అర్హులైన …

Read More »