గణేశ్ ఉత్సవాల మహా శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ప్రధాన మార్గం, అనుబంధ మార్గాలు, తిరుగు ప్రయాణం, భక్తులు వెళ్లే మార్గాలు, నిమజ్జన ప్రాంతాలు, బేబీ పాండ్లు ఇతర వివరాల రూట్‌మ్యాప్‌ను విడుదల చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. మరోవైపు ఈ ఏడాది గణనాథుడి ఊరేగింపు శోభాయాత్రలో నో సౌండ్స్ అంటూ పోలీసులు ఆంక్షలు విధించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు అంటే ప్రతి ఒక్కరి చూపు భాగ్యనగరం వైపు ఉంటుంది. చాలామంది భక్తులు నిమజ్జనాలను తిలకించడానికి ఎక్కువగా …
Read More »నగరవాసులకు మెట్రో రైల్ గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 6 అర్ధరాత్రి 2గంటల వరకు మెట్రో రైళ్లు
గణేశ్ నిమజ్జనాలను కనులారా వీక్షించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రజలకు అసౌకర్య కలగకుండా రవాణా సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన మొదటి రైలు ఉదయం 6గంటలకు మొదలుకుని అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని మెట్రో రైల్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహానగర వాసులకు శుభవార్త.. గణేశ్ నిమజ్జనాలను కనులారా వీక్షించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రజలకు అసౌకర్య కలగకుండా రవాణా సదుపాయాలు కల్పిస్తున్నారు. …
Read More »గణేశ్ నిమజ్జనానికి డీజే సౌండ్స్‌తో ఊరేగింపు.. గుండెపోటుతో యువకుడు మృతి!
వినాయక చవితి సందర్భంగా గణేశ్ నిమజ్జనం రోజున ఏర్పాటు చేసిన ఊరేగింపు ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఊరేగింపులో డీజే సౌండ్స్ తో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలి మృతి చెందాడు. హైదరాబాద్‌లో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న యువకుడు.. వినాయకచవితి పండుగకు వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో ఊరంతా ఘొల్లుమంది.. గణేష్ చతుర్దీ అంటేనే.. కుర్ర కారు జోష్‌కు పట్టపగ్గాలు ఉండవ్.. చవితి మొదలు నిమజ్జనం వరకు ధూం ధాం చేసేస్తారు. డీజే సౌండ్స్‌తో వీధులన్నీ మారుమోగిపోతాయ్.. ఇక యువకులు గణేష్ విగ్రహం …
Read More »గణపయ్యకు 10 కేజీల విప్ప పువ్వు లడ్డూ.. మొక్కు చెల్లించుకున్న భక్తుడు
విప్పపువ్వు గిరిజనులు, ఆదివాసీలు ఎంతో ఇష్టంగా, పవిత్రంగా భావిస్తారు. ఈ విప్ప పువ్వు తో అనేక లాభాలు ఉన్నాయి.. విప్ప పువ్వు సారా ను ఆదివాసీలు తమ ఇళ్లలో జరిగే వేడుకలు, పండుగల్లో తాగడం ఆచారంగా భావిస్తారు. వీటితో తయారుచేసే లడ్డూలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. ఆదివాసీలు ఆరోగ్య రహస్యం లో విప్ప పువ్వు ముఖ్యమైనది. ఇప్పుడు ఇదే విప్ప పువ్వు తో తయారు చేసిన విప్ప పువ్వు డ్రై ఫ్రూట్ లడ్డు ను గణపయ్య కు ప్రసాదంగా పెట్టారు భక్తులు. దక్షిణ అయోధ్యగా …
Read More »మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో 2 రోజులు మద్యం షాపులు, బార్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టార్ హోటల్స్, లైసెన్స్డ్ క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంది. నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. గణేశ్ నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల …
Read More »హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. గణేశ్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!
గణేష్ నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ట్యాంక్ బండ్ వద్ద జరిగే వినాయక నిమజ్జనాలను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భక్తులు తరవచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నగరంలో ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిమజ్జనాలు పూర్తయ్యే వరకు నగరంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం నగరంలోని హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ వద్ద జరిగే వినాయక …
Read More »అమ్మవారి ఆలయంలో అద్భుతం.. పూజా సమయంలో భగవతి కంట కన్నీరు.. బారులు తీరిన భక్తులు
ఓ వైపు తెలంగాణాలో కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల వలన అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇటువంటి విపత్కర పరిస్థితి సమయంలో దేవుడు దయ ఉండాలని భావించిన కొంతమంది భక్తులు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ సేవా సమితి పూజలు చేస్తున్న సమయంలో ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. శ్రీ పరంజ్యోతి భగవతి అమ్మవారి కంట కన్నీరు వచ్చినట్లు భక్తులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. …
Read More »యాదగిరిగుట్టకు అంతర్జాతీయ గుర్తింపు.. స్వామివారి సేవలను ప్రశంసించిన కెనడా ప్రధాని!
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యాదగిరిగుట్ట దేవస్థానం అందిస్తున్న సేవలను ఇప్పటికే ప్రపంచ నేతలు, ఆధ్యాత్మిక వేత్తలు ప్రసంశించారు. తాజాగా యాదగిరిగుట్ట దేవస్థానం అందిస్తున్న సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ అభినందించారు. ఈ మేరకు యాదగిరిగుట్ట దేవస్థానంకు ఆయన లేఖ రాశారు. తెలంగాణ తిరుపతిగా పేరున్న శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు నానాటికి పోటెత్తుతున్నారు. ముఖ్యంగా సెలవు దినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. దీంతో యాదగిరిగుట్ట దేవస్థానం …
Read More »గణపతి విగ్రహంతో పాటు రూ.5 లక్షల విలువైన బంగారం నిమజ్జనం.. కట్ చేస్తే..
హైదరాబాద్ శివారులో వినాయక నిమజ్జనం సందర్భంగా గిరిజ కుటుంబం ఐదు తులాల బంగారాన్ని విగ్రహంతో పాటు చెరువులో నిమజ్జనం చేయడంతో కలకలం రేగింది. నిమజ్జనం తర్వాత వారికి బంగారం విషయం గుర్తుకువచ్చింది..? ఆ తర్వాత వారు ఏం చేశారు..? బంగారం తిరిగి వారి చేతుల్లోకి వచ్చిందా..? తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు వినాయక నవరాత్రి సందడితో కళకళలాడిపోతున్నాయి. ఊరూరా మండపాలు వెలసి.. గణపతి బప్పా మోరియా నినాదాలతో మారుమోగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు కూడా ప్రారంభమయ్యాయి. కాగా హైదరాబాద్ శివారులోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని …
Read More »కరెన్సీ నోట్ల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న వినాయకుడు.. ఎన్ని కోట్లను ఉపయోగించారంటే..
మంగళగిరి ప్రధాన వీధిలోని మండపంలో గణపతిని నోట్ల తో అందంగా అలంకరించారు. వ్యాపారులు తమ వద్ద నున్న నోట్లను ఇచ్చి కొత్త నోట్లను ముందుగానే తెచ్చుకుంటారు. నూతన కరెన్సీని మాత్రమే స్వామి వారి అలంకరణకు ఉపయోగిస్తారు. ఆ తర్వాత వాటిని ఎవరికి వారికి ఇస్తారు. సంకా బాలాజీ గుప్తా ప్రతి ఏటా ఈ అలంకరణను పర్యవేక్షిస్తారు. స్థానిక వ్యాపారులంతా సహకరిస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం మంగళగిరిలోని వినాయకుడికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. ప్రతి ఏటా ప్రధాన వీధిలోని ఏర్పాటు చేస్తున్న విగ్రహం …
Read More »