కువైట్ సిటీ : గత బుధవారం తెల్లవారుజామన కువైట్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది మరణించారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఆ విమానం చేరుకుంటుందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్న భారభరితంగా మారిపోయింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి, బిజెపి …
Read More »ఆ రాశి వారికి ఉద్యోగాల్లో హోదా పెరగే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
దిన ఫలాలు (జూన్ 14, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఊహించని రీతిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. మిథున రాశి వారు ఆర్థిక లావాదేవీలకు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు …
Read More »71 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సప్..ఎందుకో తెలుసా?
ఏప్రిల్ నెల నివేదికను విడుదల చేసిన వాట్సప్నిబంధనలు ఉల్లంఘించే ఖాతాలపై ప్రత్యేక దృష్టిసైబర్ ఫ్రాడ్.. మోసాలు..హానికరమైన కంటెంట్లు ప్రచురించే అకౌంట్లకు చెక్ ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులపై శ్రద్ధవహిస్తూనే ఉంది. వాట్సాప్ కి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో నిలదొక్కుకోలేలపోయాయి. యూజర్స్ అవసరాలు, అభిరుచిని బట్టి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇవ్వటమే ఇందుకు కారణమని చెప్పచ్చు. ఇవే కాకుండా తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకునే వారిపై వాట్సప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొన్ని భారతీయ ఖాతాలపై …
Read More »కువైట్ లో అగ్నిప్రమాదం.. వారికి మోడీ సర్కార్ రూ. 2 లక్షల సాయం
Kuwait Fire: కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు భారత ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2 లక్షల సాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధి నుంచి అందజేస్తారు. కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఈ దురదృష్టకర సంఘటనపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. …
Read More »భారత క్రికెట్ చరిత్రలో.. తొలి బౌలర్‌గా అర్ష్‌దీప్ అరుదైన ఘనత
టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) యూఎస్‌ఏపై భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దాంతోపాటు మరో రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో 10 పరుగులు కంటే తక్కువ ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అశ్విన్ (4/11) రికార్డును అర్ష్‌దీప్ అధిగమించాడు. పొట్టి కప్‌లో తొలి బంతికే వికెట్ …
Read More »పవన్ కల్యాణ్‌కు నెలకు ఎంత జీతం వస్తుంది..?
ఎమ్మెల్యేగా గెలిచిన తాను పూర్తి జీతం తీసుకుంటానని పవన్ కల్యాణ్ తెలిపారు. దీంతో ఆయనకు ఎంత జీతం వస్తుందో అనే చర్చ మొదలైంది. ఆయనకు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు. డిప్యూటీ సీఎం, మంత్రి కూడా. మరి ఆయన అదనంగా సమకూరే సదుపాయాలు ఏంటి అన్నవి తెలుసుకుందాం పదండి. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన 100 శాతం స్ట్రైయిక్ రేటు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. ఇక కొత్త …
Read More »