అంతర్జాతీయం

గుజరాత్‌ గిఫ్ట్‌ సిటీలో సైప్రస్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఏర్పాటు! ప్రధాని మోదీ హర్షం

ప్రధానమంత్రి మోదీ సైప్రస్ పర్యటనలో భాగంగా, గుజరాత్‌లోని GIFT సిటీలో సైప్రస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), సైప్రస్ ఎక్స్ఛేంజ్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఇది GIFT సిటీని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మరింత బలోపేతం చేస్తుంది.గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో సైప్రస్‌ స్టాక్‌ఎక్స్చేంజ్‌ ఏర్పాటు అవుతోంది. ఈ మేరకు మన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌కు, టర్కీ ఎక్స్చేంజ్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. సైప్రస్‌లో పర్యటించిన ప్రధాని మోదీ, ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. …

Read More »

జాగ్రత్త.. ఈ ఐదురకాల ఆహారపదార్థాలతో క్యాన్సర్ ముప్పు!

ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాపకింద నీరులా విస్తరిస్తుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ప్రాథమిక స్థాయిలో కూడా దీని లక్షనాలు గుర్తించడం చాలా కష్టమైపోతుంది. దీని వలన చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే క్యాన్సర్ పట్ల ప్రత్యేక అవగాహన కలిగి ఉండటమే కాకుండా మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుం క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ ప్రమాదంలో కీలక పాత్ర ఆహారందే ఉండటం వలన కొన్ని …

Read More »

పొరపాటున కూడా ఈ 10 ఆహారాలను పచ్చిగా తినకండి.. ప్రమాదమే..!

కొన్ని పచ్చి ఆహారాలు శరీరానికి హానికరం. వీటిని పచ్చిగా తీసుకుంటే ప్రమాదమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిలో బ్యాక్టీరియా, టాక్సిన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం వాటిని తీసుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.. పచ్చి లేదా పూర్తిగా ఉడకని గుడ్లు శరీరానికి హాని కలిగిస్తాయి. వాటిలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండవచ్చు. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి సమస్యలు ఉండవచ్చు. బటన్ పుట్టగొడుగుల వంటి కొన్ని పుట్టగొడుగులను పచ్చిగా …

Read More »

డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా.. మార్క్రామ్ కీలక ఇన్సింగ్స్‌తో 27 ఏళ్ల కల సాకారం

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌లో ఆస్ట్రేలియా అందించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సౌతాఫ్రికా, ఎట్టకేలకు ఐసీసీ ట్రోఫీల్లో బ్యాడ్ లక్ ముద్రను చెరిపేసుకుంది. ఈ విజయానికి హీరోగా ఐడెన్ మార్క్రామ్ (136) నిలిచాడు. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా (66)తో కలిసి 147 పరుగుల కీలక భాగస్వామ్యంతో 27 ఏళ్లను సుగమం చేశాడు. దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. శనివారం సౌతాఫ్రికా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దక్షిణాఫ్రికా జట్టు క్రికెట్ ఏ ఫార్మాట్‌లోనైనా మొదటిసారి …

Read More »

మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిస్‌ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు.. విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ వేదికగా 72వ ప్రతిష్ఠాత్మక మిస్‌ వరల్డ్‌ పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలిగి ఈ నెల 16న తిరిగి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే తొలుత తన వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిన మిస్‌ ఇంగ్లాండ్. తమ దేశానికి వెళ్లిన తర్వాత మిస్‌ వరల్డ్‌ పోటీలపై సంచలన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో …

Read More »

రోహిత్ బాటలోనే విరాట్.. టెస్టులకు గుడ్ బై

రోహిత్‌ శర్మ బాటలోనే టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు స్టార్ క్రికెటర్ కోహ్లి. ఇంగ్లాండ్‌ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని బీసీసీఐకి ముందుగానే సమాచారమిచ్చిన కోహ్లి తాజాగా తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించాడు. ఈ సమయంలో రిటైర్మెంట్ వద్దని బీసీసీఐ వారించినప్పటికీ.. కోహ్లి పట్టించుకోలేదని తెలుస్తోంది.బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఇంగ్లండ్ టూర్‌కు ముందు టెస్టులకు కింగ్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. 14 ఏళ్ల టెస్టు కెరీర్ తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన …

Read More »

పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆగ్రదేశాధి నేతలు.. ట్రంప్, పుతిన్‌ సహా పలువురి స్పందన ఇదే

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పుల్వామా దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌ లోయలో జరిగిన మరో అతి పెద్ద దాడి ఇదే. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. నిషేధిత లష్కరే తోయిబా …

Read More »

సౌదీ గగనతలంలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. 3 యుద్ధ విమానాల ఎస్కార్ట్‌తో అపూర్వ స్వాగతం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నారు. సౌదీలో ప్రధాని మోదీకి ఆపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని విమానానికి రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందిన F15 విమానం భద్రత కల్పించింది. భారతదేశం, సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. సౌదీ అరేబియాను విశ్వసనీయ స్నేహితుడుగా, వ్యూహాత్మక మిత్రదేశంగా ఆయన అభివర్ణించారు. 2019లో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పడినప్పటి నుండి, ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన విస్తరణ …

Read More »

యవ్వనంగా కనపడాలంటే ఇవి తినాల్సిందే.. వృద్ధాప్యాన్ని దూరం పెట్టే సీక్రెట్స్ ఇవే

ఆహారాన్ని బాగా నియంత్రిస్తే చర్మ ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపర్చుకోవచ్చు. ప్రత్యేకంగా శాకాహారంతో కూడిన కొన్ని సహజ పదార్థాలు యవ్వనాన్ని నిలబెట్టడంలో గొప్ప పాత్ర పోషిస్తాయి. ఈ ఆహార పదార్థాలు చర్మానికి తేమనిచ్చి, మృదుత్వాన్ని కలిగిస్తాయి. చర్మానికి సహజ ప్రకాశం ఇవ్వడంలో ఇవి ఎంతో ఉపయోగంగా ఉంటాయి.మన శరీర ఆరోగ్యం బాగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ప్రత్యేకంగా చర్మ ఆరోగ్యం యవ్వనాన్ని నిలబెట్టుకోవాలంటే కొన్ని సహజ పదార్థాలతో తయారైన వెజిటేరియన్ ఆహారాలు చాలా ఉపయోగపడతాయి. ఈ శాకాహార పదార్థాలను రోజూ తీసుకుంటే.. మన …

Read More »

హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం.. అడ్డుకుంటామని VHP ప్రకటన

హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం నెలకుంది.  మే 4 నుంచి 31వరకు తెలంగాణలో ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలు నిర్వహణకు ప్లాన్ చేశారు. హైదరాబాద్‌ వేదికగా గ్రాండ్‌ ఫినాలే, ప్రారంభ-ముగింపు వేడుకలు జరగనున్నాయి. మిగతా ఈవెంట్స్‌ కోసం రామప్ప, యాదాద్రి, లక్నవరం, అనంతగిరి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.  తెలంగాణలో అందాల పోటీల నిర్వహణను విశ్వ హిందు పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  అడ్డుకుని తీరుతామని చెబుతోంది. గతంలో కూడా భారత్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు జరిగాయ్‌. 1996, 2024లో ముంబై వేదికగా ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. ఇప్పుడు …

Read More »